Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ సక్సెస్ వేడుకల్లో అనుష్క

ఆర్ఆర్ఆర్ సక్సెస్ వేడుకల్లో అనుష్క

Anushka Shetty attends RRR success party
Anushka Shetty attends RRR success party

అనుష్క తెర పైనే కాదు బయటకు కూడా కనిపించి చాల కాలం అవుతుంది. ప్రస్తుతం అనుష్క ఏమిచేస్తుంది…? ఎక్కడ ఉంది..? ఎలా ఉంది..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క ఆర్ఆర్ఆర్ సక్సెస్ వేడుకల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ..శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు జరిపింది.

శనివారం రాత్రి జరిగిన పార్టీలో రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, దిల్‌ రాజు, ఉపాసన, ప్రణతి, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు స్వీటీ అనుష్క కూడా సక్సెస్ లో పాలుపంచుకొని చిత్ర యూనిట్ లో మరింత జోష్ నింపింది. అనుష్క తెరపై కనిపించి దాదాపు మూడు నాలుగేళ్లు అవుతోంది. భాగమతి చిత్రం చివరిది కాగా.. నిశ్శబ్దం ఓటీటీలో వచ్చింది. దాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. అయితే అనుష్క ఇప్పుడు మరింత లావుగా కనిపిస్తోంది. దీంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఇదేంటి అనుష్క ఇంత లావుగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts