
ఈరోజుల్లో హీరోయిన్లు ఎంతగా గ్లామర్ షో చేస్తే అంతగా అవకాశాలు వస్తాయి. అందుకే వెండితెర ఫై మాత్రమే కాకుండా సోషల్ మీడియా లోను రెచ్చిపోతూ అందాల ఆరబోత చేస్తుంటారు. తాజాగా అనుపమ కూడా అందాల ఆరబోత కు సై అంటుంది. ప్రేమమ్ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనుపమ ..ఆ తరవాత అ ఆ , శతమానం భవతి చిత్రాలతో వరుస హిట్స్ అందుకొని యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. ఆ తర్వాత అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టినప్పటికీ , హిట్ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి.
ఈ మధ్యనే రౌడీ బాయ్స్ తో అలరించిన ఈ బ్యూటీ..త్వరలో 18 పేజిస్ , బటర్ ఫ్లై చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్య సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ వస్తున్న ఈ భామ.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అబ్బో అనిపిస్తుంది. తాజాగా నడుము అందాలు చూపిస్తూ గ్లామర్ ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఈ పిక్స్ లో అమ్మడు హాట్ హాట్ గా ఉండడం తో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.