Homeప్రెస్ నోట్స్యాంటీ వైరస్ సినిమా పాటల విడుదల

యాంటీ వైరస్ సినిమా పాటల విడుదల


ఏం. కె క్రియేషన్స్ బ్యానర్ పైన రాజ్ కుమార్ నిర్మిస్తూ, హీరో గా నటిస్తున్న సినిమా “యాంటీ వైరస్”. ఈ చిత్రానికి సుభాష్ దర్శకుడు. ఈ చిత్రం యొక్క ఆడియో రిలీజ్ వేడుక ఇటీవలే జరిగింది. హీరోయిన్లు ప్రియమణి, పూర్ణ మరియు డాన్స్ మాస్టర్ గణేష్ లు ఈ చిత్రం యొక్క పాటలు విడుదల చేసి వారి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ గణేష్ మాట్లాడుతూ “హీరో నిర్మాత రాజ్ కుమార్ నాకు మంచి మిత్రుడు, తను చేసిన డ్యాన్స్, ఫైట్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. పాటలు చాలా బాగున్నాయి, సినిమా కూడా మంచి విజయవంతం అవ్వాలి” అని కోరుకున్నారు.

- Advertisement -

హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ “టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది, ప్రస్తుతం ఉన్న కోవిడ్ కి ఈ సినిమా యాంటీ డోస్ లాగా ఆడియన్స్ ని మెప్పించాలి. పాటలు మరియు ట్రైలర్ చూసాను, సినిమా కొత్తగా ఉంది. మంచి విజయం సాధించాలి” అని తెలిపారు.

హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ “సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది, సినిమా లోని కొన్ని షాట్స్ చూసాను చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి,టీం అందరికీ బెస్ట్ విషెస్.

హీరో & నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ “నేను అడగగానే మా సినిమా పాటలు విడుదల చేసిన గణేష్ మాస్టర్ కి, పూర్ణ గారికి, ప్రియమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీం అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా ని నిర్మించాం, మా హీరోయిన్ లు అనూష, నందిత లు డెడికేషన్ తో వర్క్ చేశారు. పాటలు ,ఫైట్స్ , మెసేజ్ ఇలా అన్ని అంశాలు మా సినిమా లో ఉన్నాయి, కమర్షల్ సినిమా కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ని తీయడం జరిగింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.

ఈ సినిమా కి కెమెరా- శ్రీనివాస్ సబ్బి, సంగీతం – మురళి లియోన్,
లిరిక్స్ – లక్ష్మిభాస్కర్ కనకాల,
డాన్స్ :-
గోరా మాస్టర్,
నరేందర్ మాస్టర్,
చార్లీ మాస్టర్,
పి.ఆర్.ఓ – పవన్ పాల్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All