Homeటాప్ స్టోరీస్11 మిలియన్ వ్యూస్ సాధించిన సుందరం టీజర్

11 మిలియన్ వ్యూస్ సాధించిన సుందరం టీజర్

ante sundaraniki 11m views on youtube
ante sundaraniki 11m views on youtube

నాని నటించిన తాజా చిత్రం అంటే సుందరానికీ టీజర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. శ్యామ్ సింగరాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి అనే మూవీ చేస్తున్నాడు. బ్రోచేవారేవరురా సినిమాతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ మూవీ లో నాని ని డిఫరెంట్ గా చూపించబోతున్నాడు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 10 న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను ఈరోజు బుధువారం విడుదల చేసి ఆసక్తి నింపారు. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో 11 మిలియన్ వ్యూస్ సాధించి ట్రేండింగ్ 1 లో కొనసాగుతుంది.

టీజర్ విషయానికి వస్తే..సుందర ప్రసాద్ అనే బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని కనిపించాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఎంతో ప్రేమగా ఆప్యాయతతో చూసుకుంటున్నారు. కాకపోతే వారు విపరీతమైన కేరింగ్ తీసుకోవడం వల్ల సుందర్ ఇబ్బందులు పడుతున్నాడు.

- Advertisement -

అతని లైఫ్ లో ఏది జరిగినా జాతకంతో లింక్ పెడుతూ జ్యోతిష్కుల సలహాలు తీసుకుంటున్నారు. గండాలు ఉన్నాయని చెబుతూ తరచుగా బలవంతంగా హోమాలు చేయిస్తున్నారు. అలాంటి బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుందర్.. లీలా థామస్ అనే క్రిస్టియన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు.

రెండు కుటుంబాలు కూడా కులం మతం గురించి పట్టింపు ఉన్నవారు కావడంతో.. వీరి ప్రేమను అంగీకరించడం లేదని తెలుస్తోంది. కానీ ఇవి కాకుండా సినిమాలో ఇంకేదో ఉందనే క్యూరియసిటీ పెంచేలా ‘అంటే.. సుందరానికి’ టీజర్ ఉంది. వివేక్ సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు కెమెరా మ్యాన్ నికేత్ బొమ్మి విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. మీరు కూడా ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts