Monday, March 20, 2023
Homeటాప్ స్టోరీస్డిసెంబర్ 21 న విడుదల కాబోతున్న ' అంతరిక్షం 9000 KMPH '..!!

డిసెంబర్ 21 న విడుదల కాబోతున్న ‘ అంతరిక్షం 9000 KMPH ‘..!!

Antariksham 9000 KMPH Releasing on December 21stతెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి స్పేస్ నేపథ్యంతో వస్తున్న సినిమా ‘అంతరిక్షం 9000 KMPH ‘.. ఈ సినిమాను డిసెంబర్ 21 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.. కాగా ఈ దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయగా ఆ పోస్టర్ లో మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది..

- Advertisement -

మొదటి సినిమా’ఘాజి’ తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. వరుణ్ తేజ్, బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి లు వ్యోమగాములుగా నటిస్తుండగా, ఇటీవలే రిలీజ్ టీజర్ కి విశేషమైన స్పందన లభించింది.. తెలుగు సినిమాల్లో ఇంతవరకు తెరకెక్కించనటువంటి త్రిల్లింగ్ విజువల్స్ తో సినిమా తెరకెక్కుతుండగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది.. ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు.

నటీనటులు: వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్,రాజా, శ్రీనివాస్ అవసరాల తదితరులు

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: సంకల్ప్ రెడ్డి
సమర్పించు వారు : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు : క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
డీఓపీ : జ్ఞాన శేఖర్ VS(బాబా)
సంగీతం: ప్రశాంతి విహారీ
ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ & మోనికా నిగొత్రే సబ్బాని
PRO: వంశీ-శేఖర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts