Homeటాప్ స్టోరీస్అంతరిక్షం రివ్యూ

అంతరిక్షం రివ్యూ

antariksham 9000 kmph movie review అంతరిక్షం రివ్యూ :
నటీనటులు : వరుణ్ తేజ్ , అదితి రావు హైదరి , లావణ్య త్రిపాఠి
సంగీతం : ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం : జ్ఞానశేఖర్
నిర్మాణం : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్
దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2018

ఘాజి వంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించి తన సత్తా ఏంటో చాటి చెప్పిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి . మొదటి చిత్రంతోనే జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న సంకల్ప్ తాజాగా మరో విభిన్న కథా చిత్రం అంతరిక్షం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . వరుణ్ తేజ్ కూడా విభిన్న కథా చిత్రాలు చేస్తూ ఇమేజ్ ని పెంచుకుంటున్నాడు . తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ కు క్రిష్ జాగర్లమూడి కూడా తోడవ్వడంతో అంతరిక్షం పై అంచనాలు పెరిగాయి . మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా ? లేదా ? అన్నది చూద్దామా !

- Advertisement -

కథ :

దేవ్ ( వరుణ్ తేజ్ ) శాటిలైట్ ని డీ కోడ్ చేసి సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయడంలో నిష్ణాతుడు అయితే టీమ్ లో మిగతా వాళ్ళ కంటే కాస్త ఇగో ఎక్కువ దాంతో దేవ్ పై చెడు అభిప్రాయంతో ఉంటారు . ఏదైనా ప్రయత్నిస్తే తప్పకుండా గెలుస్తామనే ధీమా దేవ్ ది . నీరా శాటిలైట్ ఫెయిల్ అయితే యావత్ ప్రపంచం లోని కమ్యూనికేషన్ దెబ్బ తింటుందని భావించి మళ్ళీ దేవ్ ని పిలిపిస్తారు . దేవ్ ఆ శాటిలైట్ ని డీ కోడ్ చేయడంలో సక్సెస్ అయ్యాడా ? మిగతా టీమ్ మెంబర్స్ ని కలుపుకొని పోయాడా ? అంతరిక్షంలో భారతీయుడి జెండా పోతాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

వరుణ్ తేజ్
కథ ,కథనం
విజువల్స్
నేపథ్య సంగీతం
అదితి రావు హైదరి
డైరెక్షన్
నిర్మాతల ధైర్యం

డ్రా బ్యాక్స్ :

ఎడిటింగ్

నటీనటుల ప్రతిభ :

వరుణ్ తేజ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ! అద్భుతమైన నటన తో ఆకట్టుకున్న వరుణ్ ని నటనకు మెచ్చుకోవడం కాదు ఇలాంటి విభిన్న తరహా కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటుంన్నదుకు , అందునా అంతరిక్షం వంటి చిత్రాన్ని చేసినందుకు తప్పకుండా అభినందించాలి . అదితి రావు హైదరీ రియా పాత్రలో మెప్పించింది . మరోసారి అద్భుత నటి అని నిరూపించుకుంది అదితి . లావణ్య త్రిపాఠి తన పాత్ర మేరకు బాగానే నటించింది . అవసరాల శ్రీనివాస్ , రహమాన్ , సత్యదేవ్ , కునాల్ లకు మంచి పాత్రలు లభించాయి . మిగతా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రాహకులు జ్ఙానశేఖర్ ని తప్పకుండా అభినందించి తీరాలి . తక్కువ బడ్జెట్ అనే ముందు నుండి చెబుతున్నారు ఆ చిత్ర బృందం . అయినప్పటికీ అద్భుతమైన విజువల్స్ అందించాడు జ్ఙానశేఖర్ వి ఎస్ . ఇక అంతరిక్షం సెట్టింగ్ కి వస్తే అద్భుతాన్ని సృష్టించారు రామకృష్ణ , మౌనిక లు . రంగస్థలం తో బాగా ప్రాచుర్యం పొందిన ఈ జంట పని తీరు అంతరిక్షం లో మరోసారి తమ ప్రతిభని నిరూపించుకునే అవకాశం లభించింది . ఇక సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి కూడా నేపథ్య సంగీతం తో అలరించాడు . రాజీవ్ రెడ్డి – సాయి బాబు – క్రిష్ ల సాహసానికి మెచ్చుకోకుండా ఉండలేం . ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి విషయానికి వస్తే …… హీరో రాంచరణ్ చెప్పినట్లుగా సంకల్ప్ టాలెంట్ కి అతడి కటౌట్ కి సంబంధమే లేదు . మొదటి సినిమా ఘాజి తోనే తన దారి ఏంటో చూపించాడు . ఇక ఇప్పుడేమో మరోసారి ఎవరూ టచ్ చేయని అంతరిక్షం ని టచ్ చేసి తన ప్రత్యేకతని నిరూపించుకున్నాడు . అక్కడక్కడా స్లో నేరేషన్ తో కాస్త ఇబ్బంది పడినప్పటికీ ఓవరాల్ గా అద్భుతమైన సినిమాని టాలీవుడ్ కు అందించాడు .

ఓవరాల్ గా :

అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అంతరిక్షం

English Title: antariksham 9000 kmph movie review

 Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All