
వచ్చే వారం ఆర్ఆర్ఆర్ మూవీ అనేక భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్య క్రమాలతో సందడి చేస్తున్నారు. అభిమానులు సైతం ఎప్పుడెప్పుడు బొమ్మ పడుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు లో డిస్ట్రిబ్యూటర్లకు షాక్ ఇచ్చారు ఎగ్జిబిటర్లు.
తాజా సమాచారం మేరకు మొదటి వారం షేర్ 55% ఉంటేనే సినిమాను ప్రదర్శిస్తామని FEUOK (ది ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ) డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరిస్తున్నారట. సినిమా రిలీజ్ టైం ఇదేంటి అని వారంతా వాపోతున్నారట. భారీ ధరలు పెట్టి సినిమాను కొనుగోలు చేస్తే..ఎగ్జిబిటర్లు ఇలా బెదిరించడం ఏంటి అని వారంతా వాపోతున్నారు. మరి ఈ పరిస్థితిని తగ్గించేందుకు ఆర్ఆర్ఆర్ నిర్మాత ఏం చేస్తారో చూడాలి.
- Advertisement -