
చిత్రసీమలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం..ఏడాది తిరిగే లోపే విడాకులు తీసుకోవడం కామన్ అయ్యింది. ఇలాంటివి ఎక్కువగా బాలీవుడ్ లో జరుగుతుండేవి కానీ ఈ మధ్య మన తెలుగు, ఇతర చిత్రసీమలోను ఎక్కువగా జరుగుతున్నాయి. అగ్ర హీరోల దగ్గరి నుండి నేటితరం యంగ్ హీరోల వరకు చాలామందే పెళ్లి చేసుకొని , విడాకులు ఇచ్చిన వారు ఉన్నారు. కొంతమంది విడాకులు ఇచ్చి , మరో పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు..విడాకుల తర్వాత మరో పెళ్లి జోలికి పోకుండా ఉన్న వారు ఉన్నారు. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య – ధనుష్ లు విడాకులు తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు కానీ మళ్లీ సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో మరో సినీ హీరో విడాకులు తీసుకోబోతున్నాడనే వార్త బయటకు వచ్చింది.
కరోనా లాక్ డౌన్ సమయంలో తాను ప్రేమించిన అమ్మాయిని చాలా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న ఒక యువ హీరో కాపురంలో ఇప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయి అని తెలుస్తోంది. పెళ్లయిన ఏడాదిలోపే తాము ఇద్దరం కలిసి ఉండలేము అనే నిర్ణయానికి ఇద్దరు వచ్చారని అంటున్నారు. ఇరు కుటుంబ సభ్యులు ఇద్దరికీ నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు మాత్రం విడాకులు తీసుకోవాల్సిందే అని అంటున్నారట. ఇక చేసేదేం లేక లీగల గా కోర్ట్ నుండి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం సదరు యంగ్ హీరో వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు.