Homeటాప్ స్టోరీస్మరో కొత్త హీరో తెలుగు తెరకు పరిచయం కానున్నాడా!

మరో కొత్త హీరో తెలుగు తెరకు పరిచయం కానున్నాడా!

Another New Hero Bellamkonda Sai Ganesh to be introduced in Telugu
Another New Hero Bellamkonda Sai Ganesh to be introduced in Telugu

ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించి ప్రొడ్యూసర్ గా తనకంటూ మంచిపేరు సంపాదించుకున్నారు బెల్లంకొండ సురేష్.. ఇండస్ట్రీలో ఆయన తెలీని వారంటూ ఎవరూ లేరు. ఆయన ఇద్దరు కుమారుల్లో మొదటగా సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ అల్లుడు శీను సినిమా తీశారు.. ఇక అక్కడ నుంచి సాయి శ్రీనివాస్ వెనుతిరిగి చూడకుండా ఇప్పుడున్న యంగ్ హీరోస్ కి ధీటుగా పోటీ పడుతూ.. వరుసగా సినిమాలు చేస్తున్నారు శ్రీనివాస్. లేటెస్ట్ గా ఆయన రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ సాధించారు. ఇదిలా ఉండగా బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు సాయి గణేష్ ని కూడా హీరోగా లాంచ్ చేయడానికి రంగం సిద్ధమైంది. పవన్ సాధినేని దర్శకత్వంలో బెక్కం వేణు గోపాల్, బెల్లంకొండ సురేష్ సంయుక్తంగా నిర్మించే చిత్రంలో సాయి గణేష్ హీరోగా చేయనున్నాడు.. ఇప్పటికే సాయి గణేష్ యు.యస్, బొంబయిలలో యాక్టింగ్ కోర్స్ చేసాడు.. మిగతా డాన్స్, ఫైట్స్, అన్నిట్లో శిక్షణ పొందిన సాయి గణేష్లో హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నే వున్నాయి.. త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. అతి త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All