Homeటాప్ స్టోరీస్మళ్ళీ దెబ్బతిన్న మెగా మేనల్లుడు

మళ్ళీ దెబ్బతిన్న మెగా మేనల్లుడు

another disaster from sai dharam tejమెగా మేనల్లుడు మరోసారి ప్లాప్ ఎదుర్కొన్నాడు . ప్రేమకథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా కాబట్టి పెద్ద హిట్ కాకపోయినా కనీసం హిట్ అయినా అవుతుందని అనుకున్నాడు సాయిధరమ్ తేజ్ . మేనమామ పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దాంతో తనకు ఆ స్థాయి విజయం కాకపోయినా ఓ మోస్తారు విజయం అయినా ఇవ్వకపోతాడా అని అతడిపై ఆశలు పెట్టుకున్నాడు కానీ సాయిధరమ్ తేజ్ ఆశలన్నీ అడియాసలయ్యాయి . నిన్న విడుదలైన ”తేజ్ ఐ లవ్ యు ” చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది దాంతో మెగా మేనల్లుడి ఆశలన్నీ ఆవిరై పోయాయి .

తాజాగా తేజ్ ఐ లవ్ యు చిత్ర ప్లాప్ తో వరుసగా ఆరు ప్లాప్ లను అందుకున్నాడు సాయిధరమ్ తేజ్ . సుప్రీమ్ సూపర్ హిట్ అయ్యింది అయితే దాని తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన తిక్క , విన్నర్ , నక్షత్రం , జవాన్ , ఇంటలిజెంట్ , ఇక ఇప్పుడేమో తేజ్ ఐ లవ్ యు చిత్రాలతో కలిపి మొత్తంగా ఆరు అపజయాలను మూటగట్టుకున్నాడు . పాపం హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు . కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ కొట్టలేక పోతున్నాడు . కథల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకోక ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు మెగా మేనల్లుడు పాపం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All