Homeటాప్ స్టోరీస్ఏపీలో భీమ్లా నాయక్ కు మరో ఎదురుదెబ్బ..

ఏపీలో భీమ్లా నాయక్ కు మరో ఎదురుదెబ్బ..

another controversy on bheemla nayak
another controversy on bheemla nayak

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రానికి ఏపీలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూవీ లో తమ మనోభావాలు దెబ్బతీసేలా సన్నీవేశం ఉందంటూ రాష్ట్ర కుమ్మరి, శాలివాహన వర్గానికి చెందిన నేతలు ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ – రానా కలయికలో సాగర్ కె చంద్ర డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు సైతం భారీగా రాబడుతుంది. అయితే ఏపీలో మాత్రం భీమ్లా నాయక్ కు సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. అదనపు షోస్ కు అనుమతి ఇవ్వకపోవడం , టికెట్ ధరలు కూడా పెంచుకోకుండా చేయడం తో అక్కడ కలెక్షన్లు చాల తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఫై కక్ష్య సాధింపు చర్య చేస్తుందని అభిమానులు , జనసేన నేతలు, తెలుగుదేశం నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తుండగా..తాజాగా కుమ్మరి, శాలివాహన వర్గానికి చెందిన నేతలు భీమ్లా నాయక్ సినిమా ఫై విమర్శలు చేయడం ఇప్పుడు మరో తలనొప్పిగా మారింది.

- Advertisement -

సినిమాలో విలన్ గా నటించిన రానా.. ఓ సీన్ లో కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నుతున్నట్లు చీత్రీకరించారని ఇది తమ వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లేనని ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.పురుషోత్తం ఆరోపించారు. ఈ మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు ఫిర్యాదు చేశారు. తాము ఎంతో పవిత్రంగా భావించే కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నిన సీన్ తమ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా కించపరిచేలా ఉందని సినిమా డైరెక్టర్, నిర్మాతతో పాటు హీరోలపైనా చర్యలు తీసుకోవాలని పురుషోత్తం డిమాండ్ చేశారు. మరి ఈ వివాదం ఫై చిత్ర యూనిట్ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All