Homeటాప్ స్టోరీస్మహేష్ బాబుని మోసం చేసిన అనిల్ రావిపూడి

మహేష్ బాబుని మోసం చేసిన అనిల్ రావిపూడి

Anil ravipudi ignored mahesh babu
Mahesh Babu and Anil Ravipudi

మహేష్ బాబు ని మోసం చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి . అయితే దర్శకుడిగా ఉన్నప్పుడు కాదు సుమా ! రచయితగా ఉన్నప్పుడు . మహేష్ బాబు నటించిన ఆగడు చిత్రానికి రచనా సహకారం అందించాడు అనిల్ రావిపూడి . అయితే ఆగడు చిత్రానికి పూర్తిస్థాయిలో పనిచేయకుండా సగం వరకే పనిచేసి ఆ తర్వాత తనకు వచ్చిన మిగిలిన కామెడీ సీన్ల ని ఆగడు కోసం కాకుండా పటాస్ కోసం దాచి పెట్టుకున్నాడు .

కళ్యాణ్ రామ్ నుండి పిలుపు రాగానే మహేష్ సినిమాని పక్కన పెట్టి పటాస్ కథ ని రెడీ చేసుకొని కళ్యాణ్ రామ్ కు హిట్ ఇచ్చాడు దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు . అయితే అవే సన్నివేశాలు మహేష్ కోసం రాసి ఉంటే ఆగడు చిత్రం డిజాస్టర్ అయి ఉండేది కాదు . అయినా పూర్తిగా అనిల్ రావిపూడి ని తప్పు పట్టలేం ఎందుకంటే శ్రీను వైట్ల కు నచ్చిన డైలాగ్స్ , సన్నివేశాలు మాత్రమే అందులో ఉన్నాయి కాబట్టి . ఆగడు చిత్రం డిజాస్టర్ కావడంతో శ్రీను వైట్ల కు కెరీర్ లేకుండా పోయింది . అయితే అనిల్ రావిపూడి దర్శకుడిగా వరుసగా విజయాలు అందుకుంటుండటంతో మహేష్ మాత్రం చాలా సంతోషంగానే ఉన్నాడట .

- Advertisement -

English Title: Anil ravipudi ignored mahesh babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All