Homeటాప్ స్టోరీస్బాలయ్య మూవీ అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి

బాలయ్య మూవీ అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి

anil ravipudi about balakrishna movie
anil ravipudi about balakrishna movie

అనిల్ రావిపూడి – నందమూరి బాలకృష్ణ కలయికలో సినిమా రాబోతుందని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సినిమా మాత్రం కార్య రూపం దాల్చుకోవడం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ 107 వ మూవీ క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్నాడు. దీని తర్వాత ఖచ్చితంగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్న వేళ..అనిల్ రావిపూడి ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు.

బాలయ్య వేరే సినిమా షూటింగ్ లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో నాకు తెలియదు. మే 27న “ఎఫ్‌3” విడుదలయ్యాక, నా దృష్టి అంతా బాలకృష్ణ సినిమాపైకి మళ్లుతుంది. నేను ప్రస్తుతం స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాను. ఆయనకు ఇంకా కథ చెప్పలేదు. కానీ మేమిద్దరం ఈ చిత్రం కోసం 2-3 సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్నాము” అంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ నటిస్తున్న F3 చిత్రం మే 27న విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All