
ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన యదార్థ సంఘటనలకు కాల్పనిక సంఘటనల జోడించి తెరపైకి తీసుకొస్తున్నసోషియో ఫాంటసీ చిత్రం `అంగుళీక`. ప్రేమ్ ఆర్యన్ దర్శకుడు. శ్రీ శంఖు చక్ర ఫిలింస్ బ్యానర్‌పై కోటి తూముల, ఎ.జగన్‌మోహన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీపక్, శేఖర్ వర్మ, వివ్యశాన్త్ హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోవిడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ని శనివారం రిలీజ్ చేశారు.
సినిమా ట్రైలర్ బాగుంది. గ్రాఫిక్స్ చాలా గ్రాండ్‌గా వున్నాయి. నిర్మాత బడ్జెట్, దర్శకుడి ప్రతిభ ట్రైలర్‌లో కనిపిస్తోంది. `అరంధతి`లా ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలి అని ప్రసన్నకుమార్ అన్నారు. నిర్మాణ సారథి రాంబాబు చిక్కవరపు మాట్లాడుతూ `దర్శకుడు ప్రేమ్ ఆర్యన్ బాలీవుడ్ చిత్రాలకు గ్రాఫిక్స్ అందించే విభాగంలో పనిచేసిన అనుభవంతో ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా తీర్చి దిద్దాడు. స్క్రీన్‌ప్లే సరికొత్తగా వుంటుంది. మనకు ఏడు రకాల సూర్య గ్రహణాలుంటాయి. అందులో ఒక సూర్య గ్రహణం అంగుళీక ఆకారంలో వుంటుంది. సూర్య భగవానుడి అంశలో పుట్టిన ఓ అమ్మాయికి అంగుళీక సూర్య గ్రహానికి సంబంధం వుంటుంది. ఆ లింకేంటి? అన్నదే ఈ సినిమా. నిర్మాత కోటీ తూములు గట్స్ వున్న నిర్మాత` అన్నారు.
అంగుళీక అనే అమ్మాయి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను బేస్ చేసుకుని తీసిన చిత్రమిది. ఆరు వందల ఏళ్లకు ఒకసారి వచ్చే అంగుళీక సూర్య గ్రహణం ఈ ఏడాది వస్తుండటం విశేషం`అని దర్శకుడు ప్రేమ్ ఆర్యన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, ఎల్.దామోదరప్రసాద్, ముత్యాలరాందాస్, ఏలూరు సురేందర్‌రెడ్డి, దీపక్, శేఖర్ వర్మ, వివ్యశాన్త్ తదితరులు పాల్గొన్నారు.