Homeటాప్ స్టోరీస్నన్నెవరూ పడకగదికి రమ్మని కోరలేదు : ఆండ్రియా

నన్నెవరూ పడకగదికి రమ్మని కోరలేదు : ఆండ్రియా

Andrea Jeremiah sensational comments on metooహాట్ భామ వివాదాస్పద నటి ఆండ్రియా మీటూ ఉద్యమం పై సంచలన వ్యాఖ్యలు చేసింది . ఇప్పటివరకు నన్నెవరూ పడకగదిలోకి వచ్చి పడక సుఖం అందించమని కోరలేదని , నాకు అలాంటి అనుభవంఏది ఎదురు కాలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది . అయినా తప్పంతా మగవాళ్ళ పైనే నెట్టడం కరెక్ట్ కాదని , పడక సుఖం అందించాలని ఒకవేళ ఎవరైనా మగాడు కోరినా ఆడవాళ్ళ సహకారం లేకుండా ఆ కార్యక్రమం జరగదు కదా ! అంటూ దిమ్మ తిరిగే ప్రశ్న వేస్తోంది ఆండ్రియా . అంతేనా ఈ భామ మొత్తంగా చేసిన వ్యాఖ్యలు మగాళ్ళ ని సమర్ధించేలా ఉండటం విశేషం .

పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం సాగుతున్న ఎ రోజుల్లో ఆండ్రియా వ్యాఖ్యలు ఖచ్చితంగా కొంతమంది మహిళలను ఇబ్బందికి గురి చేసేవే ! అయితే మీటూ అంటూ ఉద్యమం సాగడం అభినందనీయం అని ఓ కామెంట్ కూడా చేసింది . ఆండ్రియా చెబుతున్న సారాంశం ఏంటంటే ……… మగవాళ్ళు ఆడవాళ్ళని పడక సుఖం అందించమని , అప్పుడే చాన్స్ లు ఇస్తామని ఒకవేళ ఎవరైనా అడిగితే దానికి మనం అంగీకరించకుండా ఉంటే సరిపోతుంది కదా ! ఎవరైనా లొంగితే , అందుకు సహకరిస్తే అది మగవాళ్ళ తప్పు మాత్రమే ఎలా అవుతుంది అంటూ మహిళలను ఎదురు ప్రశ్న వేస్తోంది ఆండ్రియా . తప్పంతా మొత్తం మగవాళ్ళ మీదే నెట్టడం కరెక్ట్ కాదని అందులో మహిళల పాత్ర కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చింది . నిజంగా ఆండ్రియా డిసౌజా వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది .

- Advertisement -

English Title: Andrea Jeremiah sensational comments on metoo

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All