Homeటాప్ స్టోరీస్తమిళంలో ఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ బ్యూటీ

తమిళంలో ఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ బ్యూటీ

ananya nagalla entry to tamil
ananya nagalla entry to tamil

వకీల్ సాబ్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అన‌న్య నాగళ్ళ ..తమిళ చిత్ర సీమలో అడుగుపెడుతుంది. ‘మ‌ల్లేశం’ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొద‌టి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా అవార్డు గెలుచుకుంది. ఆ త‌ర్వాత ‘ప్లే బ్యాక్‌’లో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా నటించిన ‘వ‌కీల్‌సాబ్’ సినిమాలో కీల‌కపాత్ర‌లో నటించి మంచి గుర్తింపు వ‌చ్చింది.

ప్రస్తుతం ఈమె స‌మంత నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఏడాదికి ఒకటీ రెండు సినిమాల‌తో బిజీగా గడుపుతున్న అనన్య తాజాగా త‌మిళ ఎంట్రీకి సిద్ధమైంది. త‌మిళ హీరో శ‌శికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘అంజ‌ల్’ అనే చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అన‌న్య న‌టించ‌నుంది. సౌత్ ఇండియా అంతా ప్ర‌యాణించే ఓ ట్రావెల‌ర్ క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. త్వ‌ర‌లో ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకాబోతుంది. మరి అనన్య కు ఈ మూవీ ఎలా కలిసొస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts