Friday, March 24, 2023
Homeటాప్ స్టోరీస్విశ్వనాథ్ గారి మరణంతో ఒక శకం ముగిసింది - కృష్ణం రాజు సతీమణి

విశ్వనాథ్ గారి మరణంతో ఒక శకం ముగిసింది – కృష్ణం రాజు సతీమణి

విశ్వనాథ్ గారి మరణంతో ఒక శకం ముగిసింది - కృష్ణం రాజు సతీమణి
విశ్వనాథ్ గారి మరణంతో ఒక శకం ముగిసింది – కృష్ణం రాజు సతీమణి

టాలీవుడ్ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసి ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాలేదు. కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన శివైక్యం చెందారని తెలిసి మేమంతా చాలా బాధపడుతున్నాం. కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన శివమెత్తిన సత్యం , కళ్యాణ చక్రవర్తి , అల్లుడు పట్టిన భారతం వంటి చిత్రాల్లో కృష్ణం రాజు గారు నటించారు.

- Advertisement -

హీరో కావాలని చెన్నైకి వెళ్లిన కృష్ణంరాజు గారు ప్రముఖ దర్శకుడు ఆదూర్తి సుబ్బారావు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కృష్ణంరాజు గారి నటనా ప్రావీణ్యాన్ని పరిశీలించాలని తన అసిస్టెంట్ అయిన కె.విశ్వనాథ్ గారికి సుబ్బారావు చెప్పారట. అప్పుడు ప్యాథటిక్ డైలాగ్స్ ఇచ్చి వాటిని చెప్పాలని కృష్ణంరాజును కె.విశ్వనాథ్ అడగగా ఆ డైలాగ్స్ చెప్తున్న క్రమంలోనే తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని, అది గమనించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ గారు కృష్ణంరాజు గారిని హీరోగా ఫైనల్ చేశారు.

ఈ విషయాన్ని స్వయంగా ఎన్నో సార్లు కృష్ణంరాజు గారు చెబుతూ ఉండేవారు. ఒకరకంగా కృష్ణంరాజు గారు విశ్వనాధ్ గారిని తన గురు సమానంగా భావించేవారు. విశ్వనాథ్ గారి మరణంతో ఒక శకం ముగిసినట్లయింది. విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులకు ఈ బాధను కోలుకునే విధంగా భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts