Homeటాప్ స్టోరీస్అమైరా దస్తూర్ ని కూడా వేధించారట

అమైరా దస్తూర్ ని కూడా వేధించారట

Amyra dastur sensational comments నాకు లొంగితే నేను చేయబోయే మూడు సినిమాల్లో నువ్వే హీరోయిన్ అంటూ ఓపెన్ గా చెప్పాడట ఓ బాలీవుడ్ నిర్మాత ,అయితే అతడికి నేను లొంగలేదని అందుకే సినిమాలు ఎక్కువగా చేయలేకపోతున్నానని సంచలన కామెంట్స్ చేసింది అమైరా దస్తూర్ . తెలుగు , తమిళ చిత్రాలతో పాటుగా బాలీవుడ్ లో కూడా నటించింది ఈ భామ . అయితే అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది , సక్సెస్ కాలేకపోయింది . ఒక్క హిందీలోనే కాకుండా సౌత్ లో నటించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయని అయితే వాటిని సున్నితంగా తిరస్కరించానని ఇక్కడ వాళ్లతో పెట్టుకొని నిలవగలగడం కష్టమని తెలుసుకున్నానని అందుకే వాళ్ళ పేర్లు వెల్లడించడం లేదని కూడా అంటోంది అమైరా దస్తూర్ .

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభత్వాలు కానీ స్పందించలేదు . దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . ఇక అమైరా దస్తూర్ విషయానికి వస్తే …… నన్ను అవమానించి తక్కువగా చూసిన వాళ్ళని క్షమించేది లేదని అయితే నేను వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోగలను అని భావించినప్పుడు తప్పకుండా వాళ్ళ పేర్లు బయటపెడతానని అంటోంది . అయితే మీ టూ ఉద్యమం తీవ్రం అవుతున్నప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు , స్పందించడం లేదు .

- Advertisement -

English Title: Amyra dastur sensational comments

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All