Homeటాప్ స్టోరీస్అమ్మమ్మ గారిల్లు రివ్యూ

అమ్మమ్మ గారిల్లు రివ్యూ

Ammammagarillu Reviewఅమ్మమ్మ గారిల్లు రివ్యూ
నటీనటులు : నాగశౌర్య , షామిలి , రావు రమేష్
సంగీతం : కల్యాణ రమణ
నిర్మాత : రాజేష్
దర్శకత్వం : సుందర్ సూర్య
రేటింగ్ : 3 / 5
రిలీస్ డేట్ : 25 మే 2018

నాగశౌర్య – షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో రాజేష్ నిర్మించిన చిత్రం ” అమ్మమ్మగారిల్లు ” . బంధాలను , అనుబంధాలను స్పృశించే అమ్మమ్మగారిల్లు ప్రేక్షకుల ను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

నగరంలో ఉండే సంతోష్ ( నాగశౌర్య ) కు అమ్మమ్మ గారిల్లు పై మమకారం ఉంటుంది , చిన్నప్పుడు పీఠాపురం లోని తన అమ్మమ్మ గారింటికి వెళ్లి వస్తుండేవాడు కానీ తన మేనమామ రవి బాబు ( రావు రమేష్ ) ఆస్థిని పంచమని గొడవ చేయడంతో సంతోష్ తాత చనిపోతాడు . దాంతో అమ్మమ్మ గారి ఇంట్లో ని ఉమ్మడి కుటుంబం విడిపోతుంది . అయితే మళ్ళీ తన కుటుంబం అంతా కలిసి ఎప్పుడు వస్తారో అని ఆశగా ఎదురు చూసే అమ్మమ్మ కోరిక ని ఆ మనవడు ఎలా తీర్చాడు ? ఆస్థి కోసం వెంపర్లాడే అమ్మమ్మ కుటుంబం లోని వాళ్ళని ఎలా ఆప్యాయతల విలువ తెలియజేసేలా చేసాడు అన్నదే మిగతా కథ .

హైలెట్స్ :

గ్రామీణ వాతావరణం
నాగశౌర్య
రావు రమేష్
ఎమోషనల్ సీన్స్
షకలక శంకర్ కామెడీ

డ్రా బ్యాక్స్ :

నిడివి

 

నటీనటుల ప్రతిభ :

నాగశౌర్య సంతోష్ పాత్రలో బాగా మెప్పించాడు , ఎమోషనల్ సీన్స్ లో సైతం మెచ్యూరిటీ కనబరిచాడు . నాగశౌర్య ఎంతగా మెప్పించాడంటే ప్రతీ అమ్మమ్మ గారింట్లో ఇలాంటి మనవడు ఒకడు ఉంటే చాలు అనిపించేలా చేసాడు . షామిలి నాగశౌర్య కు మంచి జోడీ అనిపించుకుంది , అయితే పెద్దగా నటించడానికి స్కోప్ లేకుండా పోయింది . ఇక ఈ సినిమాకు రావు రమేష్ , షకలక శంకర్ లు హైలెట్ గా నిలిచారు . రావు రమేష్ ది ప్రత్యేక శైలి అన్న విషయం తెలిసిందే . తనకు మాత్రమే సాధ్యమయ్యే డిఫరెంట్ మేనరిజం తో ఈ అమ్మమ్మ గారిల్లు ని ఓ మెట్టు పై నిలిచేలా చేసాడు . షకలక శంకర్ తన కామెడీ తో ప్రేక్షకులను నవ్వించాడు . శివాజీరాజా , హేమ , సుధ , సుమన్ , పోసాని లతో పాటు మిగతా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

రసూల్ ఎల్లోర్ అందించిన ఛాయాగ్రహణం బాగుంది , కళ్యాణ రమణ అందించిన పాటల్లో రెండు బాగున్నాయి అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు . రాజేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు సుందర్ సూర్య విషయానికి వస్తే …… …. మనీకి ఇస్తున్న విలువ మనిషికి అందునా బంధానికి అనుభందానికి ఇవ్వడం లేదనే కోణాన్ని తీసుకొని హార్ట్ టచింగ్ సీన్స్ ని బాగానే రాసుకున్నాడు అయితే కాస్త నిడివి తగ్గించి ఉంటే కథ ని మరింత వేగంగా నడిపించి ఉంటే బాగుండేది . మొత్తానికి మనిషి తన మూలాలను మర్చిపోతున్న ఈ సమయంలో అమ్మమ్మ గారిల్లు ని గుర్తు చేసిన విధానం చాలా బాగుంది .

ఓవరాల్ గా :

అమ్మమ్మ గారిల్లు చూడాల్సిన సినిమా

               Click here for English Review

https://www.youtube.com/watch?v=LSWZGgJ0K0Y

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All
నాగశౌర్య - షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో రాజేష్ నిర్మించిన చిత్రం '' అమ్మమ్మగారిల్లు '' . బంధాలను , అనుబంధాలను స్పృశించే అమ్మమ్మగారిల్లు ప్రేక్షకుల ను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .అమ్మమ్మ గారిల్లు రివ్యూ