Homeటాప్ స్టోరీస్ఆదిత్య మ్యూజిక్ చేతికి `అమ్మ‌మ్మ‌గారిల్లు ` ఆడియో హ‌క్కులు

ఆదిత్య మ్యూజిక్ చేతికి `అమ్మ‌మ్మ‌గారిల్లు ` ఆడియో హ‌క్కులు

ammamma-garillu-movie-updatesశ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా రాజేష్ మ‌రియు కె.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, ` చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం..స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్ మూవీ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తోంది. ఇటీవ‌లే సినిమా శాటిలైట్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది. తాజాగా ఆడియో హ‌క్కుల‌ను ఆదిత్య మ్యూజిక్ ద‌క్కించుకుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత గా పెరుగుతున్నాయి. ఈనెల 22న టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మానికి హీరో నాగ శౌర్య , హీరోయిన్ షామిలితో పాటు, మిగ‌తా టీమ్ స‌భ్యులంతా హ‌జ‌రు కానున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం` అని అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All