Homeటాప్ స్టోరీస్అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ

నటీనటులు: అజ్మల్ అమీర్, బ్రహ్మానందం, అలీ, మహేష్ కత్తి తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: జగదీశ్ చీకటి
దర్శకత్వం: సిద్ధార్థ్ తాతోలు, రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ
విడుదల తేదీ: డిసెంబర్ 12, 2019
రేటింగ్: 1.5/5

రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా తన పట్టుని కోల్పోయి చాలా కాలమైంది. కేవలం తన ఉనికిని నిలుపుకొవడానికే ప్రస్తుతం సినిమాలు తీస్తున్నాడు వర్మ. తన ప్రతి సినిమా ప్లాప్ అయినా కూడా మళ్ళీ కొత్త సినిమాకు క్రేజ్ తీసుకురావడమెలాగో వర్మకు బాగా తెలుసు. అలాగే ఈసారి ఫిక్షనల్ పొలిటికల్ సెటైర్ అంటూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు… కాదు కాదు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను దించాడు వర్మ. సెన్సార్ సమస్యలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ:
చెప్పడానికి రామ్ గోపాల్ వర్మ ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పాడు కానీ సినిమాలోని ప్రధాన పాత్రల దగ్గరనుండి ప్రతి చిన్న పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పాత్రలనే గుర్తుకుతెస్తాయి. రూలింగ్ లో ఉన్న వెలుగు దేశం పార్టీని మట్టికరిపించి విఎస్ జగన్నాథరెడ్డి(అజ్మల్ అమీర్)కు చెందిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే ఆ తర్వాత నుండి రాజకీయ పరిస్థితులు మారి వెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని రమ హత్యకు గురవుతాడు.

ఆ హత్యతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయి? మధ్యంతర ఎన్నికలకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? దాని తర్వాత పర్యవసానాలు ఎలా సాగాయి అన్నది మిగిలిన కథ.

నటీనటులు:
ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకోవడానికేం లేదు. ఎందుకంటే ఇందులో ఎవరి గురించి చెప్పాలన్నా నటించారు అని చెప్పడానికి లేదు. బాగా ఇమిటేట్ చేసారు అనే చెప్పాలి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్.. ఇలా ప్రముఖులు అందరినీ పోలిన పాత్రలు ఇందులో ఉంటాయి. ఆయా పాత్రలకు ఎంపికైన వారు పెర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అందరికంటే కెఏ పాల్ ను పోలిన పాత్రను పోషించిన వ్యక్తి, నారా లోకేష్ ను పోలిన పాత్రను పోషించిన వ్యక్తి ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు. మిగతా వారు కూడా ఇమిటేషన్ లో ఎక్కడా తగ్గలేదు.

సాంకేతిక వర్గం:
ముందుగా ఈ సినిమాకు కాస్టింగ్ చేసిన వ్యక్తిని మెచ్చుకుని తీరాలి. ప్రతీ పాత్రకూ సరిగ్గా సరిపోయేలా నటులను ఎంపిక చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ విషయంలో ఆర్జీవీ పాత్ర కూడా కీలకం కాబట్టి అంతవరకూ తనను మెచ్చుకోవచ్చు. జగదీశ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. కథలో మ్యాటర్ లేనప్పుడు ఏ ఎడిటర్ అయినా చేయగలిగేది ఏముంటుంది. రామ్ గోపాల్ వర్మ దీన్నొక స్పూఫ్ లా తీద్దామనుకున్నాడు. అంతవరకూ బానే ఉంది కానీ కనీసం ఎంటర్టైనింగ్ వే లో అయినా చెప్పి ఉండాల్సింది. అసలు దీనికి కథంటూ ఏం లేదు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఒకటి తర్వాత ఒకటి పేర్చుకుంటూ పోయి, భవిష్యత్తులో ఇదీ జరిగేది అంటూ అర్ధం పర్ధం లేని ఒక ఫిక్షన్ ను జోడించి, దానికి అర్ధం పర్ధం లేని స్క్రీన్ ప్లే ను జతచేసి వదిలారు వర్మ అండ్ కో. దర్శకత్వ ప్రతిభ గురించి మళ్ళీ ప్రస్తావించుకునేది ప్రత్యేకంగా ఏం లేదు. నిర్మాణ విలువలు ఓకే.

చివరిగా:
అర్ధం పర్ధం లేని సినిమాలు ఎన్నో తీసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలులో పీక్స్ చూపించాడు. స్పూఫ్ వీడియోలను ఒకటి తర్వాత ఒకటి పేర్చుకుంటూ వెళ్లిపోయారు. పోనీ అది కూడా సరిగ్గా చేసింది లేదు. ఏదో ఆడియన్స్ పై పగ పట్టేసినట్లు ఈ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించాడు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All