Homeటాప్ స్టోరీస్షోలో` ప్రీమియ‌ర్ జ్ఞాప‌కాల్ని గుర్తుచేసిన బిగ్‌బి!

షోలో` ప్రీమియ‌ర్ జ్ఞాప‌కాల్ని గుర్తుచేసిన బిగ్‌బి!

షోలో` ప్రీమియ‌ర్ జ్ఞాప‌కాల్ని గుర్తుచేసిన బిగ్‌బి!
షోలో` ప్రీమియ‌ర్ జ్ఞాప‌కాల్ని గుర్తుచేసిన బిగ్‌బి!

45 ఏళ్ల క్రితం ఇండియ‌న్ స్క్రీన్‌పై ఓ అద్భుతం జ‌రిగింది అదే `షోలే`. ‌బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, ధ‌ర్మేంద్ర హీరోలుగా హేమా మాలిని, జ‌యా బ‌చ్చ‌న్ హీరోయిన్‌లుగా ర‌మేష్ సిప్పీ ద‌ర్శ‌క‌త్వంలో జి.పీ. సిప్పీ ఈ చిత్రాన్ని నిర్మించారు. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో `షోలే` తిర‌గ‌రాసిన చ‌రికొత్త చ‌రిత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ చిత్రం కోసం ఆర్‌.డి. బ‌ర్మ‌న్ అందించిన సంగీతం ఇప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీన్‌గా నిలిచింది.

గ‌బ్బ‌ర్‌సింగ్‌, బ‌సంతి, జై, వీరూ, ఠాకూర్ బ‌ల్దేవ్‌సింగ్‌, రాధా వంటి పాత్ర‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే వున్నాయి. 70వ ద‌శ‌కంలో వ‌చ్చిన తొలి 70 ఎంఎం స్టీరియో సౌండ్ సినిమాచిత్ర‌మిది. ఈ చిత్రానికి ప‌నిచేసింది స‌ల్మాన్ ఖాన్ ఫాద‌ర్ స‌లీమ్‌ఖాన్‌, ఫ‌ర్హాన్ అక్త‌ర్ తండ్రి జావేద్ అక్త‌ర్‌. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. భార‌తీయ సినిమా గ‌తిని మార్చిన చిత్ర‌మిది. ఇప్ప‌టికీ `షోలే` అంటే ప‌డి చ‌చ్చే జ‌నాలు దేశ వ్యాప్తంగా కోట్ల‌ల్లో వున్నారంటే ఈ చిత్ర ప్ర‌త్యేక‌త ఏంటో అర్థ‌మ‌వుతుంది.

- Advertisement -

ఆగ‌స్టు 15, 1975లో విడుద‌లైన ఈ చిత్రం గురించి, ఈ సినిమా ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా జ‌రిగిన సంఘ‌ట‌న గురించి ఇన్ స్టా వేదిక‌గా ఓ ఫొటోని పోస్ట్ చేసి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని షేర్ చేశారు. “షోలే` ప్రీమియ‌ర్ షోని మిన‌ర్వా థియేట‌ర్‌లో ప్లాన్ చేశాం. అమ్మ‌, నాన్న‌, జ‌య‌తో పాటు మ‌రి కొంత మంది పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో జ‌య ఎంత అందంగా క‌నిపిస్తుందో చూడండి. ప్రీమియ‌ర్ షో కోసం 35 ఎంఎం ప్రింట్‌ని తీసుకొచ్చాం. 70 ఎంఎం ప్రింట్ క‌ష్ట‌మ్స్ వారి వ‌ద్ద చిక్కుకుపోయింద‌ని తెలిసింది. ఆ త‌రువాత వారి వ‌ద్ద ఆ ప్రింట్ లేద‌నే వార్త‌లు విన్నాం. దీని వ‌ల్ల ప్రింట్ థియేట‌ర్‌కు అర్థ్ర‌రాత్రి దాటాక చేరింది. ఈ చిత్రాన్ని నేను, వినోద్ ఖ‌ణ్నా మై అంత‌స్తు బాల్క‌నీలో కూర్చుని తెల్ల‌వారు జాము 3 గంట‌ల వ‌ర‌కు చూశాం` అని బిగ్‌బి అల‌నాటి ప్రీమియ‌ర్ షో జ్ఞాప‌కాల్ని పంచుకున్నారు.

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All