Homeటాప్ స్టోరీస్నా రూటే సపరేటు అంటున్న బాలీవుడ్ హీరో

నా రూటే సపరేటు అంటున్న బాలీవుడ్ హీరో

నా రూటే సపరేటు అంటున్న బాలీవుడ్ హీరో
నా రూటే సపరేటు అంటున్న బాలీవుడ్ హీరో

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలకి పబ్లిసిటీ చాలా ముఖ్యం. సినిమా వాళ్ల పబ్లిసిటీ మీద ఇప్పటికే చాలా ట్రోల్స్ మరియు మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే పని కంటే పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి సొసైటీలో కూడా కొంతమంది అరుదుగా పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకడు. కెరీర్ తొలినాళ్లలో నుంచి ఇప్పటి వరకు అమీర్ ఖాన్ ది ఒక విభిన్నమైన దృక్పథం.

హడావిడిగా సినిమా చేయడు. కథ నచ్చకపోతే అసలే చేయడు. కచ్చితంగా స్క్రిప్ట్ లో కూడా ఆమిర్ చేయి ఉండాల్సిందే. సినిమా అయ్యేంతవరకు పబ్లిసిటీ గురించి ఆలోచించడు.ఇక సినిమా పూర్తయ్యాక అప్పటి పరిస్థితులను బట్టి తనదైన కొత్త కొత్త ఆలోచనలతో ఆ సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు. సినిమా హిట్ అయితే ఓకే; ఫ్లాపయితే డబుల్ ఒకే అన్నట్లు ఉంటాడు. ఇక ఇండస్ట్రీలో అందరూ కలెక్షన్ల గురించి చేసే చర్చలలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వడు. అవార్డు కార్యక్రమాలకు అసలే హాజరవ్వడు. సోషల్ మీడియా కూడా చాలా దూరం. సామాజిక ప్రాధాన్యత ఉన్న “సత్యమేవజయతే” లాంటి కార్యక్రమాలు అరుదుగా చేస్తాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చడ్డా” అనే సినిమా చేస్తున్నాడు.

- Advertisement -

ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకి రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో కరీనాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సౌత్ ఇండియా సెన్సేషనల్ యాక్టర్,మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే అమీర్ ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో ప్రవేశించాడు. అమితాబచ్చన్ లాంటి లెజెండ్ ఆర్టిస్ట్లు కూడా సోషల్ మీడియాను వాడుకుంటున్న ఈరోజుల్లో అమీర్ ఖాన్ ప్రవర్తన తీరు మీద కొంత మంది విమర్శకుల దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. సినిమాకు సంబంధించి ఏ ప్రమోషన్ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్న సినిమా మేకర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు ఆమిర్ ఖాన్.

తనపై వస్తున్న విమర్శలను ఒకే సమాధానం చెబుతూ, తనకున్న కొద్దిపాటి సమయంలో సోషల్ మీడియాలో సమయం వెచ్చించాలి.! అని తనకు అనిపించిదని, ప్రజలతో ఏది పంచుకోవాలన్న గాని సినిమాల ద్వారానే పంచుకుంటాను అని, ఎవరైనా కావాలని తనపై విమర్శలు చేస్తే వాటికి బాధపడనని, అదేవిధంగా సినిమాల పరంగా ఎవరైనా వివరణాత్మకంగా విమర్శిస్తే నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అని ఆమిర్ తెలియజేశాడు. ఇక టైం మారాల్సిందే నా టైమింగ్ మారదు అంటున్న అమీర్ ఖాన్ తన వరుస హిట్లతో ఇలాగే కెరియర్ కొనసాగించాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All