Homeటాప్ స్టోరీస్అమెజాన్ లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్ ..కాకపోతే

అమెజాన్ లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్ ..కాకపోతే

amazon-prime-on-sarakru-vaari-paata
amazon-prime-on-sarakru-vaari-paata

సూపర్ స్టార్ మహేష్ బాబు , మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మే 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరి ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఈ మూవీ ఇప్పుడు సైలెంట్ గా అమెజాన్ ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రస్తుతం ప్రేక్షకులు ఓటిటి కి బాగా అలవాటుపడ్డారు. థియేటర్స్ లలో సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వేలు వేలు పెట్టి థియేటర్స్ లలో సినిమా చూసే బదులు మూడు వారాలు వెయిట్ చేసి ఇంట్లో హ్యాపీ గా సినిమా చూడొచ్చు అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇటీవల కాలంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘పుష్ప’ ‘రాధేశ్యామ్’ ‘ఆచార్య’ వంటి సినిమాలు మూడు వారాల్లోనే డిజిటల్ వేదిక మీదకు వచ్చేస్తే.. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ చిత్రం 50 రోజులకు ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ క్రమంలో ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా జూన్ రెండో వారంలో స్ట్రీమింగ్ లోకి వస్తుందని భావించారు. కానీ సర్కార్ ను మాత్రం అంతకంటే ముందే అమెజాన్ వారు స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చారు.

- Advertisement -

కాకపోతే ‘సర్కారు వారి పాట’ ను అందరికీ అందుబాటులోకి తీసుకురాలేదు. పే పర్ వ్యూ రెంటల్ విధానంలో ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సాధారణ సబ్ స్క్రిప్షన్ కలిగివున్న వినియోగదారులు.. అదనంగా డబ్బులు చెల్లించి ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. ఇటీవల ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ఇలానే పే పర్ వ్యూ మోడల్ లో స్ట్రీమింగ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత సాధారణ సబ్ స్క్రైబర్స్ అందరికీ అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమాను కూడా అలాగే చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All