Homeటాప్ స్టోరీస్డైవోర్స్ వార్త‌ల‌పై అమ‌లాపాల్ ఘాటు రిప్లై!

డైవోర్స్ వార్త‌ల‌పై అమ‌లాపాల్ ఘాటు రిప్లై!

డైవోర్స్ వార్త‌ల‌పై అమ‌లాపాల్ ఘాటు రిప్లై!
డైవోర్స్ వార్త‌ల‌పై అమ‌లాపాల్ ఘాటు రిప్లై!

అమ‌లాపాల్ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌. విజ‌య్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆ త‌రువాత ఏర్పడిన మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా అత‌నితో విడిపోయింది. అయితే విజ‌య్‌తో అమ‌ల విడాకులు తీసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు హీరో ధ‌నుష్ అని, అత‌ను న‌టిస్తూ నిర్మించాల‌నుకున్న`అమ్మ క‌న‌క్కు` చిత్రంలో అమ‌ల‌ను న‌టించాల‌ని కోరాడ‌ని, వివాహం త‌రువాత న‌టించ‌న‌ని మాటిచ్చిన అమ‌ల ధ‌నుష్ కార‌ణంగా ఆ సినిమా అంగీక‌రించి ఇచ్చిన మాట త‌ప్పింద‌ని, అదే విజ‌య్‌, అమ‌ల విడాకులకు ప్ర‌ధాన కార‌ణంగా మారింద‌ని ఇటీవ‌ల విజ‌య్ తండ్రి అళ‌గ‌ప్ప‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఈ వార్త‌ల‌పై హీరోయిన్ అమ‌లా పాల్ ఘాటుగా స్పందించింది. త‌ను ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో విడిపోవ‌డానికి ధ‌నుష్ కార‌ణ‌మ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో అర్థం లేద‌ని, అత‌నికి త‌న విడాకుల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. వ్య‌క్తిగత కార‌ణాల వ‌ల్లే తానూ, విజ‌య్ విడిపోయామ‌ని, ఈ విష‌యంలో ఎవ‌రిని బ్లేమ్ చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని వెల్ల‌డించింది.

- Advertisement -

ధ‌నుష్ గురించి మాట్లాడుతూ ` ధ‌నుష్ త‌న‌కు మంచి మిత్రుడని, త‌న శ్రేయోభిలాష‌ని చెప్పిన అమ‌లాపాల్ అంత‌కు మించి త‌న విడాకుల గురించి చెప్ప‌లేన‌ని, అది గ‌డిచిపోయిన విష‌య‌మ‌ని, దాని గురించి మ‌ళ్లీ మ‌ళ్లీ వివ‌రించ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All