
అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ , అల్లు శిరీష్ లు ఇండస్ట్రీ కి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు కానీ , అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్(బాబీ) మాత్రం తెరవెనుక ఉండిపోయాడు. చాలా ఏళ్ళుగా బాబీ గీతా ఆర్ట్స్ లో అనేక రకాల సినిమాలకు ప్రొడక్షన్ లో వర్క్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఆ విషయం బయటకు తెలియలేదు. ప్రస్తుతం తండ్రికి తగ్గ తనయుడిగా నిర్మాతగా మంచి గుర్తింపు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ తో గని అనే మూవీ ని నిర్మించారు. ఏప్రిల్ 08 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లలో పాల్గొన్న బాబీ..అనేక విషయాలను షేర్ చేస్తున్నాడు.
ఓ ఇంటర్వ్యూ లో సదరు యాంకర్..అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందా..ఉంటె ఎప్పుడు చేస్తారని అడుగగా..అల్లు అర్జున్ నా తమ్ముడే కావొచ్చు .. కానీ తను ఇప్పుడు స్టార్ హీరో. ఆయనతో సినిమా చేయడం అంత ఆషామాషీ విషయమేం కాదు. చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. నేను ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని సొంతంగా సినిమాలు చేసుకుంటున్నాను. అందువలన ఇప్పట్లో తనతో సినిమా చేయడం కష్టమే. ఇక తనతో సినిమా చేయాలంటే ముందుగా మంచి కథను సెట్ చేసుకోవాలి. అలాంటి ఒక కథను వెతికి పట్టుకోవడం కూడా అంత ఈజీ ఏమీ కాదు. అలాంటి కథతో ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను నిర్మించకపోయినా ప్రెజెంట్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు.