
అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ , అల్లు శిరీష్ లు ఇండస్ట్రీ కి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు కానీ , అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్(బాబీ) మాత్రం తెరవెనుక ఉండిపోయాడు. చాలా ఏళ్ళుగా బాబీ గీతా ఆర్ట్స్ లో అనేక రకాల సినిమాలకు ప్రొడక్షన్ లో వర్క్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఆ విషయం బయటకు తెలియలేదు. ప్రస్తుతం తండ్రికి తగ్గ తనయుడిగా నిర్మాతగా మంచి గుర్తింపు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ తో గని అనే మూవీ ని నిర్మించారు. ఏప్రిల్ 08 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లలో పాల్గొన్న బాబీ..తాను తెరపైకి రాకపోవడానికి కారణాలు చెప్పుకొచ్చాడు.
సాధారణంగా ఒక సారి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత నటీనటులందరూ కూడా బయటకు వెళితే వాళ్ల అందరికీ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందరూ వారిని చూసేందుకు ఎగబడతారు. అది నాకు తెలుసు. అయితే పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేసరికి వారికి చాలా తక్కువగా ప్రైవసీ ఉంటుంది. స్వేచ్ఛగా వాళ్ళు బయట తిరగలేరు. కానీ నేను మాత్రం ఇష్టానుసారంగా ఎప్పుడైనా బయటకు వెళ్లి ఒక టీ తాగి వస్తాను. నాకు నచ్చినట్లు విశాల ప్రపంచంలో ఉండగలుగుతాను. ఒక స్టార్ ఇమేజ్ ఉంటే మాత్రం ఆ విధంగా స్వేచ్ఛగా బతకలేను అనుకోని అందుకే యాక్టింగ్ వద్దు అని చిన్నప్పుడే నిర్ణయించుకున్నానని బాబి చెప్పుకొచ్చాడు.