
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే కాదు ఆయన భార్య స్నేహా రెడ్డి కూడా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ తన పుట్టిన రోజు వేడుకలను యూరప్ లో జరుపుకోగా..దాని తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేసాయి. భార్య పిల్లలతో పాటు సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈ పిక్స్ లలో స్నేహా రెడ్డికి సంబంధించిన ఓ పిక్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
అందుకు కారణం ఆ పిక్ లో స్నేహా రెడ్డి లూయిస్ విట్టన్ కోటు ధరించింది. ఈ కోటు ధర రూ. 509311. అవును మీరు విన్నది నిజమే. దీంతో స్నేహా వేసుకున్న ఆ కోటు గురించి నెట్టింట ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి బన్నీ మాదిరి స్నేహా కూడా మంచి ఫ్యాషన్ ఐకాన్. ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తులు ధరించి గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసే స్నేహా.. ఇప్పుడు ఫ్యాషన్ విషయంలో మరోసారి వార్తల్లో నిలిచింది.