Homeగాసిప్స్అల్లు అర్జున్ ఇంతవరకు చెప్పలేదు

అల్లు అర్జున్ ఇంతవరకు చెప్పలేదు

జనసేన అధినేత జనాల్లోకి వెళుతున్నాడు , ప్రజలను కలుస్తున్నాడు దాంతో మెగా కుటుంబం నుండి చరణ్ , సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ ఇలా అందరూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు కానీ అదే కాంపౌండ్ కి చెందిన అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు అందజేయలేదు దాంతో ఇదొక టాపిక్ అయి కూర్చుంది . తెలంగాణ లో పర్యటించిన సమయంలో స్పందించలేదు సరే ! ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న సమయంలో నైనా స్పందిస్తాడేమో అని అనుకున్నారు కానీ చెప్పడం లేదు ఈ బ్రదర్ . 
 
ఇప్పటికే పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే . గతకొంత కాలంగా ఈ గొడవ సాగుతూనే ఉంది . ఎప్పటికి తీరేనో ఈ గొడవ . పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల కోసం సమాయత్తం అవుతుండగా , అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేస్తున్నాడు . ఏప్రిల్ 27న ఈ సినిమా రిలీజ్ కానుంది . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All