Homeటాప్ స్టోరీస్పంచ్ లతో ఆకట్టుకున్నఅల్లు అర్జున్

పంచ్ లతో ఆకట్టుకున్నఅల్లు అర్జున్

పంచ్ లతో ఆకట్టుకున్నఅల్లు అర్జున్
పంచ్ లతో ఆకట్టుకున్నఅల్లు అర్జున్

మామూలుగా సినిమా వేడుకలు, అందులోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే, అందరికీ గుర్తుకు వచ్చేది, అందరూ ఎదురు చూసేది హీరో స్పీచ్ కోసం. ఒక మ్యాచ్ కి కోచ్ స్పీచ్ ఎంత ముఖ్యమో, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో స్పీచ్ అంతే ముఖ్యం. అందులోనూ తమ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా మాట్లాడుతూనే, మరోవైపు సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళే ఒక పెద్ద బాధ్యత ఉంటుంది. పెద్ద హీరోలు ఎలాగూ బాగా మాట్లాడుతారు.ఇక యంగ్ హీరోలలో అభిమానుల మనసు హత్తుకునే విధంగా మాట్లాడగల హీరో అల్లు అర్జున్.

అల… వైకుంఠపురం మ్యూజికల్ కన్సర్ట్ (ప్రీ రిలీజ్) వేడుకలో ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ స్థాయి పంచ్ లతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా గ్యాప్ తీసుకోలా… వచ్చింది” తో మొదలెట్టి, “ఖాళీగా ఉన్న మొగుడు ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది…” “ప్రపంచం ముందు ఫీల్ అయ్యే హీరోఇజం కన్నా, పెళ్ళాం ముందు ఉండే హీరోఇజం లో ఉండే కిక్కే వేరు” లాంటి డైలాగ్స్ చెప్తుంటే ముందు ఉన్న అభిమానులతో పాటు, వేదిక మీద ఉన్న సినిమా టీం, చివరకి గురూజీ తో సహా మెస్మరైజ్ అయిపోయారు. ఇక మెగా ఫ్యాన్స్ అందరూ, త్రివిక్రమ్ తో 3 సినిమాలు చేసిన బన్నీ ఎంతైనా గురూజీ దగ్గర నుండి సబ్జెక్ట్ గట్టిగా నేర్చుకున్నాడు అంటూ మురిసిపోతున్నారు. ఇక ట్రైలర్ లో కూడా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, టేకింగ్ మెండుగా ఉంది. ఇక 12వ తేదీ తెరపై బన్నీ – గురూజీ విశ్వరూపం చూడవచ్చన్నమాట…

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All