Homeటాప్ స్టోరీస్F3 సెట్స్ లో అల్లు అర్జున్ సందడి..!

F3 సెట్స్ లో అల్లు అర్జున్ సందడి..!

Allu Arjun Special Surprise in F3 Sets
 

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ F3. F2 సినిమా సూపర్ హిట్ అవడంతో దానికి కొనసాగింపుగా ఈ సినిమా చేస్తున్నారు. అయితే F3 సినిమా..F2కి సీక్వల్ కాదని డైరక్టర్ అనీల్ రావిపుడి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో పుష్ప రాజ్ అదేనండి మన అల్లు అర్జున్ సందడి చేశాడు. F3 షూటింగ్ సెట్ లో అల్లు అర్జున్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ప్రధాన తారాగణంతో షూటింగ్ జరుపుతుండగా అల్లు అర్జున్ వచ్చి హంగామా చేశాడు. సెట్ లో వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, వరుణ్ తేజ్ లతో కాసేపు ముచ్చటించారు. పుష్ప రాజ్ ఎంట్రీతో F3 సెట్ సందడిగా మారిందని తెలుస్తుంది. ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సుకుమార్ చాలా స్పెషల్ ఫోకస్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

- Advertisement -

F3 సినిమాను ముందు 2022 సంక్రాంతి రిలీజ్ అనుకున్నా సంక్రాంతి సినిమాల రేసులో వరుస భారీ ప్రాకెక్టులు వస్తుండటంతో F3 ఆ రేసు నుండి తప్పుకుందని టాక్. అయితే F3 అఫీషియల్ రిలీజ్ డేట్ వెల్లడించాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All