Homeటాప్ స్టోరీస్కొత్త కోరిక‌ని బ‌య‌ట‌పెట్టిన స్టైలిష్‌స్టార్!

కొత్త కోరిక‌ని బ‌య‌ట‌పెట్టిన స్టైలిష్‌స్టార్!

Allu Arjun reveled his Bollywood entry
Allu Arjun reveled his Bollywood entry

టాలీవుడ్‌లో త‌న‌దైన స్టైల్స్‌తో గ‌త 16 ఏళ్లుగా ఆక‌ట్టుకుంటున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఫ్యామిలీ స‌పోర్ట్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చినా డ్యాన్సుల్లో, ఫైట్స్‌లో త‌న‌దైన ముద్ర‌వేసుకున్నారు. స్టైష్‌స్టార్‌కి ఫ్యాన్ బేస్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేర‌ళ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో భారీగానే వుంది. స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకున్న బ‌న్నీ ఈ సంక్రాంతికి మాట‌ల మాంత్రికుడు రూపొందిస్తున్న `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

ఈ సంద‌ర్భంగా వ‌రుస మీడియా మీటింగ్‌ల‌తో బిజీగా వున్న ఆయ‌న తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న మ‌న‌సులో వున్న కోరిక‌ని బ‌య‌ట పెట్టేశారు. త‌న‌కు బాలీవుడ్‌లో సినిమా చేయాల‌ని వుంద‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. అయితే దానికి కొన్ని కండీష‌న్స్ పెట్టారు. అది నాకు మంచి  మంచి సినిమా అనిపించాలి. గొప్ప క‌థ‌, గొప్ప ద‌ర్శ‌కుడు.. ఇలా అన్నీ క‌రెక్ట్‌గా కుదిరి ఆ ప్రాజెక్ట్ త‌న ద‌గ్గ‌రికి వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

బ‌న్నీకి ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో మంచి మార్కెట్ ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. బ‌న్నీ హిందీ అనువాద చిత్రాల‌కు తెలుగులో ఏ హీరోకు లేని మంచి మార్కెట్‌ వుంది. త‌న మార్కెట్ ప‌రిథిని ఈ ఏడాది మ‌రింత‌గా పెంచుకోవాల‌ని అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్‌కు వెళ్లాల‌ని, పాన్ ఇండియా స్థాయి సినిమా చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. అది ఎప్పిటికి కార్య‌రూపం దాలుస్తుంద‌న్న విష‌యంలో మాత్రం ఇంకా బ‌న్నీ టీమ్ నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All