Homeటాప్ స్టోరీస్పోలీస్‌స్టేష‌న్‌లో పుష్ప‌రాజ్ సీన్ అదిరింది!

పోలీస్‌స్టేష‌న్‌లో పుష్ప‌రాజ్ సీన్ అదిరింది!

పోలీస్‌స్టేష‌న్‌లో పుష్ప‌రాజ్ సీన్ అదిరింది!
పోలీస్‌స్టేష‌న్‌లో పుష్ప‌రాజ్ సీన్ అదిరింది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రానికి `పుష్ప‌` అనే టైటిల్‌ని క‌న్ఫ‌మ్ చేశారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్‌, ముత్యంశెట్టి మీడియా బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బుధవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని ఈ చిత్ర టైటిల్‌లోగో ఫ‌స్ట్‌లుక్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. బ‌న్నీ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా మాసీవ్ పాత్ర‌లో న‌టిస్తున్నీ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, య‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో స్టిల్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. పోలీస్‌స్టేష‌న్‌లో గంధ‌పు చెక్క‌ల మ‌ధ్య‌న నేల‌పై కుర్చున్న బ‌న్నీ లుక్ సినిమా ఏ స్థాయిలో వుండ‌బోతోందనేది చెప్ప‌క‌నే చెప్పేస్తోంది. శేషాచ‌లం అడువుల్లో గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం `రంగ‌స్థ‌లం ` త‌ర‌హాలో 80 లేదా 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది.

- Advertisement -

బ‌న్నీ పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు కూడా ఇందుకు అద్దంప‌డుతోంది. బ‌న్నీ లారీడ్రైవ‌ర్‌గా మాస్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో  ర‌ష్మిక మంద‌న్న ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. హాలీవుడ్ కెమెరామెన్ మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. బ‌న్నీ- సుక్కుల క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడ‌వ చిత్ర‌మిది. దీంతో ఈ చిత్రం విష‌యంలో బ‌న్నీ ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వున్నార‌ట‌. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాని సుకుమార్ తెర‌పైకి తీసుకురాబోతున్నాట‌ర‌.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All