
‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తర్వాత ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ చేస్తున్న సినిమా.. అలాగే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత ‘అల్లు అర్జున్‘ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా “అల.. వైకుంఠపురములో”. వీరిద్దరి కలయికలో మూడవ సినిమాగా రాబోతుంది.
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత ఇరువురి ఫ్యాన్స్ వారి మూడవ సినిమాకోసం ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు సినిమా పేరు మార్చడం జరిగింది అని వార్త బయటికి వచ్చింది. అదేంటి? మళ్ళి ఈ సినిమాకి కూడా అభిప్రాయాల భేదం ఏమన్నా వచ్చింది అని ఎవరైనా కేసు పెట్టారా? లేక ఇంకా ఏమన్నజరిగిందా అని కంగారు పడుతున్నారా? మీరేం కంగారుపడకండి పేరు మార్చింది తెలుగులో కాదు.. ఇంగ్లీష్ లో.
అల.. వైకుంఠపురములో తెలుగు టైటిల్ పడిన తర్వాత సినిమా పేరు ఇంగ్లీష్ లో మారుతుంది కదా.. అప్పుడు దాంట్లో కొన్ని మార్పులు సెంటిమెంట్ ని ద్రుష్టి లో పెట్టుకుని కాంప్రమైజ్ అవ్వకుండా..ala vaikuntapuramulo ని ala vaikuntapuramulo గా మార్చారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా..తాజాగా ఈ సినిమాలో సాంగ్‌కు సంబంధించిన `సామజవరగమన.. ` అనే సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది దాంట్లో మార్పులు చూసి అందరూ ఫిక్స్ అయిపోయారు.
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తుంది. జయరాం, మురళీశర్మ తదితరులు కీలక పాత్రధారులుగా నటించారు. కోటీశ్వరుడు, పేదవాడు స్థానాలు తారుమారైతే వచ్చే మార్పులను ఆధారంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. థమన్.ఎస్ సంగీతాన్ని అందిస్తుండగా ..అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మాతలు.
