Homeఎక్స్ క్లూసివ్అల్లు అర్జున్ పవన్ తరుపున ప్రచారం చేయడం లేదు

అల్లు అర్జున్ పవన్ తరుపున ప్రచారం చేయడం లేదు

అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ జనసేన తరుపున ప్రచారం చేయడం లేదు కాకపోతే విమర్శలు మరీ ఎక్కువ అవుతాయని భావించాడేమో మద్దతు ఇస్తున్నట్లుగా ఓ లేఖ విడుదల చేసాడు నిన్న . పవన్ కళ్యాణ్ కు అలాగే నాగబాబు కు కూడా మా మద్దతు ఉంటుందని ఆ లేఖ సారాంశం .

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మెగా హీరోలను ప్రచారం చేయాలని కోరలేదు కానీ ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో మెగా క్యాంప్ దెబ్బ ఎలా ఉంటుందో అంతా కలిసి చూపిస్తారని అనుకున్నారు మెగా ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం మద్దతు మాత్రమే ప్రకటిస్తున్నారు మెగా హీరోలు .

మొన్నటికి మొన్న రాంచరణ్ ప్రకటించగా నిన్న అల్లు అర్జున్ తన మద్దతు లేఖ రూపంలో తెలియజేసాడు . ఇక చిరంజీవి అయితే ఎంచక్కా జపాన్ వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు . నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . ఇక పవన్ కళ్యాణ్ భీమవరం తో పాటుగా గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాడు . ఏప్రిల్ 11 న పోలింగ్ మే 23 న ఫలితాలు వెలువడనున్నాయి . అప్పుడు కానీ జనసేన ప్రభావం , పవన్ కళ్యాణ్ ప్రాభవం ఏంటో తెలుస్తుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All