Homeటాప్ స్టోరీస్సుకుమార్ సూప‌ర్ స్కెచ్ రెడీ!

సుకుమార్ సూప‌ర్ స్కెచ్ రెడీ!

సుకుమార్ సూప‌ర్ స్కెచ్ రెడీ!
సుకుమార్ సూప‌ర్ స్కెచ్ రెడీ!

లెక్క‌ల మాస్టారు సుకుమార్ త‌న లెక్క‌ల్ని ప‌క్క‌న పెట్టి కేవ‌లం క‌థ‌ని, పాత్ర‌ల్ని న‌మ్మి చేసిన సినిమా `రంగ‌స్థ‌లం`. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించింది. `మ‌హాన‌టి` పోటీలో లేక‌పోతే ఉత్త‌మ న‌టుడు నుంచి దాదాపు కీల‌క పుర‌స్కారాన్నీ ఈ సినిమాకే ద‌క్కేవి. అంత‌లా ఈ చిత్రాన్ని సుకుమార్ మ‌లిచారు. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌ని చూపించిన తీరు, ఆయ‌న పాత్ర‌ని సుక్కు డిజైన్ చేసిన తీరు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

అదే స్థాయిలో సుకుమార్ తన తాజా  చిత్రంలోని హీరో పాత్ర‌ని డిజైన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌రువాత వెంట‌నే సుకుమార్ చిత్రంలో న‌టించ‌బోతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ యెర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

- Advertisement -

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ కి సంబంధించిన క‌థ‌గా న‌ల్ల‌మ‌ల నేప‌థ్యంలో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ ఊర‌మాస్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం. `రంగ‌స్థ‌లం`లోని చిట్టిబాబు పాత్ర‌ని కొత్త‌గా డిజైన్ చేసిన సుకుమార్ ఈ చిత్రంలోనూ అదే త‌ర‌హాలో అల్లు అర్జున్ పాత్ర‌ని డిజైన్ చేశార‌ని, ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా గుబురు గ‌డ్డం, మీసాల‌తో క‌నిపించ‌బోతున్నారని, ఇందుకు సంబంధించిన స్కెచ్‌ల‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌త్యేకంగా సిద్ధం చేయించార‌ని తెలిసింది. సంక్రాంతి త‌రువాతే ఈ సినిమా ప్రారంభిస్తార‌ని తాజా స‌మాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All