Homeటాప్ స్టోరీస్ఏ బిడ్డా ఇది నా (రికార్డుల)అడ్డా.. 'పుష్ప' రాజ్ పాట నాటు.. వేట ఊర నాటు..!

ఏ బిడ్డా ఇది నా (రికార్డుల)అడ్డా.. ‘పుష్ప’ రాజ్ పాట నాటు.. వేట ఊర నాటు..!

Allu Arjun E Bidda Idi Na Adda Review

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో సినిమా అంటేనే అదో డిఫరెంట్ అటెంప్ట్ అని ఫిక్స్ అవ్వాల్సిందే. ఆ ప్రయత్నంలోనే ఆర్య, ఆర్య 2 వచ్చాయి. అయితే ఆ రెండు సినిమాలు యూత్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసిన సినిమాలు. పెరిగిన అల్లు అర్జున్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని పుష్ప కథ రాసుకున్నాడు సుకుమార్. పుష్ప సినిమాతో కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్.

- Advertisement -

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు సుకుమార్. సినిమాకు హైలెట్ గా నిలిచేలా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉంటుందని అర్ధమవుతుంది. ఇప్పటికే 3 సాంగ్స్ ఇరగ్గొట్టేయగా ఇప్పుడు నాల్గవ సాంగ్ ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ ఊర మాస్ సాంగ్ తో వచ్చారు. మాస్ సాంగ్.. అందుకు తగినట్టుగానే లిరిక్స్.. ఏమాత్రం తగ్గని హీరో యాటిట్యూడ్ అబ్బో ఇవన్ని ఈ పాటకి ప్లస్సే.

ఇక లిరిక్ లో ఉన్నట్టు ఏ బిడ్డా ఇది నా అడ్డా కాదు అల్లు అర్జున్ రికార్డుల అడ్డా అనేలా ఉంది. అంతేకాదు మాస్ నాటు పాటతో అల్లు అర్జున్ రికార్డుల వేట కూడా ఊర నాటు రేంజ్ లో ఉంటుందని అర్ధమవుతుంది. డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All