Homeటాప్ స్టోరీస్మహేష్ కంటే బన్నీ బాదుడెక్కువైంది

మహేష్ కంటే బన్నీ బాదుడెక్కువైంది

Mahesh Babu and Allu Arjun
Mahesh Babu and Allu Arjun

టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. గత కొన్నేళ్లుగా పొంగల్ బరిలో స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం కామన్ గా నడుస్తున్నదే. ఎప్పటికప్పుడు ఎవరి స్థాయిలో వారు కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇక చాలా కాలం తరువాత స్టయిలిష్ స్టార్ – సూపర్ స్టార్ ల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ ఆసక్తిని కలిగిస్తోంది.2019 సంక్రాంతి బరిలో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ – అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి.

ఈ ఇద్దరు హీరోలకు వారికంటూ ఒక స్పెషల్ స్టాండర్డ్ మార్కెట్ ఉంది కాబట్టి తప్పకుండా మంచి ఓపెనింగ్స్ అందుతాయని చెప్పవచ్చు. అయితే ఓపెనింగ్స్ రాబట్టడం అనేది అంతా ఈజీ కాదు. సినిమా ప్రమోషన్స్ ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది. ప్రమోషన్స్ చేయడంలో మహేష్ గ్యాంగ్ కాస్త వెనకబడినట్లే కనిపిస్తోంది. ఇక బన్నీ మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. రెండు పాటలతో యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. థమన్ స్వరపరిచిన ‘సామజవరగమణ’ పాట ఓ రేంజ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తే అంతకంటే ఎక్కువ స్థాయిలో ‘రాములో రాములా’ ట్రెండ్ సెట్ చేసింది.
కానీ మహేష్ మాత్రం ఇంకా పోస్టర్స్ దగ్గరే ఉన్నాడు. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రమోషన్స్ లో కూడా పోటా పోటీగా ముందుకు సాగాలి. కానీ బన్నీ బాదుడు ముందు మహేష్ కనిపించడం లేదు. దేవి శ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని ఉంచుకొని కూడా ఇంకా సాంగ్స్ ని రిలీజ్ చేయకపోవడం గమనార్హం. దర్శకుడు అనిల్ రావిపూడి – నిర్మాతలు దిల్ రాజు – అనిల్ సుంకర లు అనుభవంతో ప్రమోషన్స్ డోస్ పెంచకపోవడం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇలానే కొనసాగితే… మహేష్ సినిమా ఓపెనింగ్స్ కి బన్నీ గండికొట్టడం పక్కా…!
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All