
వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం గని. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో అల్లు బాబీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో శనివారం వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధి గా అల్లు అర్జున్ హాజరయ్యారు.
ఈ సందర్భాంగా బన్నీ మాట్లాడుతూ..నాకు వరుణ్ అంటే చాలా ఇష్టం .. చిన్నప్పటి నుంచి అందగాడు. వరుణ్ తేజ్ ఎంచుకునే కథలను చూసి నేను గర్వపడుతూ ఉంటాను. రెగ్యులర్ సినిమాలు కాకుండా ఏదో డిఫరెంట్ గా చేయాలి అనే తపనను తనలో చూశాను. ఆయన సినిమాలు హిట్ అయినా .. కాకపోయినా వాటిలో ఒక నాణ్యత ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆయన పరిగెడుతూనే ఉంటాడు. వరుణ్ చాలా సేఫ్ గా ముందుకు వెళుతున్నాడు. ఇలాంటి సమయంలో కొత్త డైరెక్టర్ తో వెళ్లడమనేది రిస్క్. అందుకు తనని అభినందిస్తున్నాను. వరుణ్ తేజ్ సినిమాలన్నీ ఒక ఎత్తు .. ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. ఈ సినిమా కోసం ఆయన మామూలుగా కష్టపడలేదు. ఆయన కసి .. హార్డ్ వర్క్ చూశాను గనుక ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.