
గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ కు నాంది రూపంలో హిట్ వచ్చి ఆయనలో కొత్త ఉత్సహం నింపింది. ఈ సక్సెస్ జోష్ తో మళ్లీ హీరోగా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే “సభకు నమస్కారం” అనే సైటిరికల్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ని పూర్తి చేసి , త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇప్పుడు తన కెరియర్ లో 59 వ సినిమాను కూడా మొదలెట్టేశాడు.
ఏ రాజ మోహన్ దర్శకత్వంలో తెలుగుఅమ్మాయి ఆనంది హీరోయిన్ గా ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అనే టైటిల్ ప్రకటించి సినిమా ఫై ఆసక్తి నింపారు.
- Advertisement -