Homeటాప్ స్టోరీస్అభిమన్యుడు ని మెచ్చుకున్న అల్లరి నరేష్

అభిమన్యుడు ని మెచ్చుకున్న అల్లరి నరేష్

allari naresh praises vishal abhimanyudu అల్లరి నరేష్ కు అభిమన్యుడు సినిమా చాలా బాగా నచ్చిందట దాంతో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసాడు . విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు చిత్రంలో సమంత కథానాయిక కాగా కీలక పాత్రలో సీనియర్ హీరో అర్జున్ నటించాడు . సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన అభిమన్యుడు చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . తమిళంలో ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది , ఇంకా మంచి కలెక్షన్లతో రన్ అవుతోంది ” ఇరుంబు తిరై ” .

డిజిటల్ ఇండియా నేపథ్యంలో సాగే మోసాల నేపథ్యంలో రూపొందిన అభిమన్యుడు చిత్రం నిన్న తెలుగులో విడుదల అయ్యింది . ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు అందునా నాగార్జున లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ విశాల్ అభిమన్యుడు చిత్రానికే అగ్ర తాంబూలం కట్టబెట్టారు ప్రేక్షకులు . విశాల్ , అర్జున్ ల నటన ను పొగడ్తలతో ముంచెత్తాడు అల్లరి నరేష్ . గతకొంత కాలంగా అల్లరి నరేష్ కు సరైన హిట్ లేదు దాంతో ఆ విజయం ఎలాంటి బూస్ట్ ఇస్తుందో బాగా తెలుసు కాబట్టి సక్సెస్ అయిన విశాల్ కు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఈ అల్లరి హీరో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All