Homeటాప్ స్టోరీస్అల్లరి నరేష్ ని ఆదుకునేది మహేష్ బాబే

అల్లరి నరేష్ ని ఆదుకునేది మహేష్ బాబే

allari naresh hopes on mahesh babu new movieఅల్లరి నరేష్ కామెడీ హీరోగా తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు , తక్కువ సమయంలోనే 50 సినిమాలకు పైగా పూర్తిచేసిన హీరో కూడా అల్లరి నరేష్ కానీ గతకొంతకాలంగా అల్లరి నరేష్ కు సరైన హిట్ లేదు దాంతో రేసులో వెనుకబడిపోయాడు . సుడిగాడు సినిమా తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందడంతో అల్లరి నరేష్ కెరీర్ చతికిలబడింది . కట్ చేస్తే …….. మళ్ళీ హిట్ కోసం తనకు సుడిగాడు వంటి సూపర్ హిట్ నిచ్చిన భీమనేని శ్రీనివాస్ తో కలిసి సినిమా చేస్తున్నాడు . ఆ సినిమా ఏమౌతుందో కానీ స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలో ఓ క్యారెక్టర్ వస్తే వెంటనే ఒప్పుకున్నాడు అల్లరి నరేష్ .

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనుంది కాగా ఆ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా కీలక పాత్ర పోషించనున్నాడు అల్లరి నరేష్ . సోలో గా హిట్ అందుకోలేక పోతున్న అల్లరి నరేష్ కు మహేష్ బాబు రూపంలో హిట్ రావడం ఖాయమని నమ్ముతున్నాడు ఈ హీరో . మహేష్ సినిమాకు స్పాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది తనకు బాగా ఉపయోగబడుతుందని భావిస్తున్నాడు అల్లరి నరేష్ అందుకే అతడి ఆశలన్నీ మహేష్ పైనే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All