Homeటాప్ స్టోరీస్ఆరు సినిమాల్లో ఒక్కటే హిట్

ఆరు సినిమాల్లో ఒక్కటే హిట్

Allari naresh and sunil are dissappointed once againసెప్టెంబర్ 7న ఆరు సినిమాలు విడుదల కాగా అందులో ఒక్క కేరాఫ్ కంచరపాలెం మాత్రమే హిట్ అయ్యేలా ఉంది . కేరాఫ్ కంచరపాలెం సినిమాకు పాజిటివ్ టాక్ బాగుంది కానీ ఆ స్థాయిలో అయితే వసూళ్లు లేవు కాకపోతే మరీ తక్కువస్థాయిలో ఏమి రావడం లేదు కాబట్టి స్లోగా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది దాంతో కేరాఫ్ కంచరపాలెం హిట్ బాట పెట్టినట్లే ! ఆ సినిమాని పక్కన పడితే మిగతా సినిమాలు మాత్రం ప్లాప్ జాబితాలో చేరిపోయాయి . ప్లాప్ జాబితాలో చేరిన సినిమాల్లో సిల్లీ ఫెలోస్ , అనువంశికత , అన్నదాత సుఖీభవ , ప్రేమకు రెయిన్ చెక్ ,మను చిత్రాలు ఉన్నాయి .

అల్లరి నరేష్ ,సునీల్ లు హిట్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు , కానీ ఎంత కష్టపడినా హిట్ మాత్రం దక్కడం లేదు ఈ ఇద్దరికీ దాంతో రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ అయిన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సిల్లీ ఫెలోస్ అనే సినిమా చేసారు పాపం . కాలం ఇంకా కలిసి రావడం లేదు వీళ్లకు . సిల్లీ ఫెలోస్ కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది అల్లరి నరేష్ ఆశలు ఆవిరి చేసింది . ఇక సునీల్ కూడా ఈ సినిమాపై నమ్మకంగా ఉండే కానీ అతడి ఆశలు కూడా అడియాసలయ్యాయి .

- Advertisement -

English Title: allari naresh and sunil are dissappointed once again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All