Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ కు సర్వం సిద్ధం... కంటెస్టెంట్స్ వీరేనా?

బిగ్ బాస్ కు సర్వం సిద్ధం… కంటెస్టెంట్స్ వీరేనా?

బిగ్ బాస్ కు సర్వం సిద్ధం... కంటెస్టెంట్స్ వీరేనా?
బిగ్ బాస్ కు సర్వం సిద్ధం… కంటెస్టెంట్స్ వీరేనా?

ఎప్పుడూ లేనిది ఈసారి బిగ్ బాస్ పై బోలెడన్ని అనుమానాలు వ్యక్తమైన విషయం తెల్సిందే. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో అసలు బిగ్ బాస్ ఉంటుందా ఉండదా, ఉంటే హోస్ట్ ఎవరు వంటి ఎన్నో ప్రశ్నలు. ఈసారి కరోనా నేపథ్యంలో ఎలాంటి టాస్క్ లు ఉండనున్నాయి. ఎటువంటి హంగామా ఉండబోతోంది.

అసలు కంటెస్టెంట్స్ ఎవరు వంటి ఎన్నో సందేహాలు. మొత్తానికి వీటిలో చాలా వాటిపై క్లారిటీ వచ్చేసింది. నాగార్జున హోస్ట్ గా ఈసారి కూడా బిగ్ బాస్ నిర్వహించనున్నారు. ఇప్పటికే మొదటి రోజు షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. నాగార్జున ఇంట్రడక్షన్ కు సంబంధించి భారీ ఏర్పాట్ల మధ్య షూట్ ను పూర్తి చేసారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ ను ఇంట్రడ్యూస్ చేసి హౌజ్ లోకి పంపారు.

- Advertisement -

ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కు సంబంధించి కంటెస్టెంట్స్ ఎవరు అన్నది ఇప్పటివరకూ పూర్తి క్లారిటీ లేదు. ప్రముఖంగా వినిపిస్తున్న పేర్ల ప్రకారం నోయెల్ సేన్, అభిజిత్, అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్, దేవి నాగవల్లి, కరాటే కళ్యాణి, గంగవ్వ, అలేఖ్య హారిక, మెహబూబ్, లాస్య, మోనాల్ గజ్జర్, సురేఖ వాణి ఈ సీజన్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All