Homeగాసిప్స్అలియా చేత ఆర్ఆర్ఆర్ టీం బలవంతంగా పోస్ట్ పెట్టించారా..?

అలియా చేత ఆర్ఆర్ఆర్ టీం బలవంతంగా పోస్ట్ పెట్టించారా..?

alia bhatt shares rrr poster
alia bhatt shares rrr poster

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఫస్ట్ టైం లో తెలుగు లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించింది. ఈ మూవీ లో చరణ్ కు జోడిగా సీత పాత్రలో నటించింది. అయితే చరణ్, ఎన్టీఆర్ నటన ముందు ఈమె నటించిన సంగతి కూడా అంత మరచిపోతున్నారు. అలాగే ఈమె రోల్ ఫై బాలీవుడ్ మీడియా లో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయట. వాస్తవానికి ఈమె రోల్ పెద్దగానే ఉన్నప్పటికీ ఎడిటింగ్ రూమ్ లో నిడివి ఎక్కువ కావడంతో ఆమె సన్నివేశాలు తొలగించారట. దీంతో ఆమె రాజమౌళి ఫై కాస్త కోపంగా ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇక సినిమా రిలీజ్ తర్వాత కూడా ఆమె రోల్ ఫై నెగిటివ్ కామెంట్స్ పడడం తో ఆమె కనీసం సినిమా గురించి కానీ , కలెక్షన్ల గురించి కానీ తన సోషల్ మీడియా పేజీలో ఒక్క పోస్ట్ పెట్టలేదు.

గతంలో పెట్టిన పోస్టులు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. అయితే ఈ విషయం తెలుగు మీడియాలో మొదలై జాతీయ మీడియా స్థాయికి పాకిన నేపథ్యంలో ఇక తప్పదు అనుకుందో లేక ఆర్ఆర్ఆర్ టీమ్ రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసి ఆమె చేత పెట్టిందో తెలియదు కానీ ఆమె సినిమా హిందీలో 100 కోట్ల కలెక్షన్లు సాధించిన పోస్టర్ ను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ అలియా చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All