Homeటాప్ స్టోరీస్లీడర్ ఫోజులు తగ్గించు అలీ

లీడర్ ఫోజులు తగ్గించు అలీ

Ali political imagination is too much on AP elections1999 లో చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి ని చేసింది నేనే ! ఇప్పుడు 2019 లో జగన్ ని ముఖ్యమంత్రి ని చేస్తా అంటూ డప్పు కొడుతున్నాడు హాస్య నటుడు అలీ . టాలీవుడ్ నటుడైన అలీ ఇటీవలే వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే . అయితే అంతకుముందు చంద్రబాబు చుట్టూ , పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగాడు కట్ చేస్తే …… జగన్ పంచన చేరాడు . అయితే జగన్ పార్టీ టికెట్ ఇవ్వకుండా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చెయ్ ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాడట దాంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్ధం అవుతున్నాడు అలీ .

 

- Advertisement -

అయితే రాజకీయ పార్టీలో ఎప్పుడైతే చేరాడో అప్పుడే పెద్ద నాయకుడిలా ఫోజు కొడుతున్నాడు అలీ . 1999 లో చంద్రబాబు ని ముఖ్యమంత్రి ని చేసింది నేనే ! అప్పుడు కూడా రాష్ట్రమంతటా ప్రచారం చేశాను , అలాగే ఓ సెంటిమెంట్ ని ఫాలో అయ్యాను . కట్ చేస్తే ఇప్పుడు కూడా 2019 లో జగన్ కోసం ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాను . తప్పకుండా జగన్ సీఎం అవుతాడు నేనే చేస్తాను అని పెద్ద ఫోజు కొడుతున్నాడు . ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఎవరుండాలో అలీ చెప్పేటట్లైతే ఎన్నికలు ఎందుకు ? ప్రజల ఓట్లు ఎందుకు ? ఎంత నటుడైనా రాజకీయాల్లో చేరితే లీడర్ గా ఫోజు కొట్టొచ్చు కానీ మరీ ఇంత దారుణంగానా అలీ .

English Title: Ali political imagination is too much on AP elections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All