Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ పై అలీ విమర్శలు

పవన్ కళ్యాణ్ పై అలీ విమర్శలు

నాకు సినిమాలు ఇప్పించావా ? లేక అలీ కి ఛాన్స్ లు ఇవ్వమని ఎవరినైనా అడిగావా ? నాకు ధన సహాయం ఏమైనా చేసావా ? నేను చేసిన ద్రోహం ఏంటి ? నేను జగన్ పార్టీలో చేరాలంటే మీ అనుమతి తీసుకోవాలా ? అంటూ పవన్ కళ్యాణ్ పై అలీ తీవ్ర స్థాయిలో చెలరేగిపోయాడు . నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో సినీ నటుడు అలీ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే .

- Advertisement -

దాంతో పవన్ కళ్యాణ్ విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అలీ . మీరు చేసినట్లుగా నేను విమర్శలు చేయను , నాకు ఆకలి వేస్తే చస్తాను తప్ప ఒకరి దగ్గరకు వెళ్లి అర్ధించను అంటూ కౌంటర్ ఇచ్చాడు అలీ . పవన్ కళ్యాణ్ – అలీ లు మంచి స్నేహితులు దాంతో అలీ కనుక రాజకీయాల్లోకి వస్తే జనసేన లోకే వస్తారని అనుకున్నాడట పవన్ కానీ పవన్ కు షాక్ ఇచ్చి జగన్ పార్టీలో చేరాడు దాంతో అలీపై ఆగ్రహంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ . అయితే పవన్ చేసిన విమర్శలకు గట్టిగానే బదులిచ్చాడు అలీ . ఇంకా అలీ రెచ్చిపోతే పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం ఎందుకంటే పవన్ లొసుగులు అన్నీ అలీ కి తెలుసు కాబట్టి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All