Homeటాప్ స్టోరీస్పునీత్​ కుటుంబాన్ని పరామర్శించిన బ్రహ్మానందం

పునీత్​ కుటుంబాన్ని పరామర్శించిన బ్రహ్మానందం

ali and brahmanandam visits puneeth house
ali and brahmanandam visits puneeth house

దివంగత నటుడు, కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులను కమెడియన్స్ అలీ , బ్రహ్మానందం పరామర్శించారు. కొద్దీ నెలల క్రితం పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త యావత్ సినీ ప్రముఖులను, అభిమానులను శోకసంద్రం లో పడేసింది.

పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణించిన తర్వాత చాలామంది సెలబ్రీటీలు ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే అల్లు అర్జున్ వెళ్లి పరామర్శించగా..తాజాగా కమెడీయన్స్‌ అలీ, బ్రహ్మానందం పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించారు. బెంగళూరులోని పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లి… ఆయన కుటుంబ సభ్యులను పునీత్‌ అన్న రాఘవేంద్ర రావు రాజ్‌ కుమాన్ ను పరామర్శించారు. ఆయన మరణం పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్‌ తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌ ఓటిటి లో రిలీజ్ కు సిద్ధమైంది. పునీత్ జయంతి (మార్చి 17) సందర్భంగా జెమ్స్‌ మూవీ థియేటర్స్ లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు అప్పు ఫ్యాన్స్‌ థియేటర్లకు పొటెత్తారు. పునీత్ ను చివరి సారిగా తెరపై చూసి కన్నీటి పర్యంతం అయ్యారు అభిమానులు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 14 నుంచి సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts