Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న అల వైకుంఠపురములో

ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న అల వైకుంఠపురములో

ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న అల వైకుంఠపురములో
ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న అల వైకుంఠపురములో

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడి బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మూడోసారి కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ అల వైకుంఠపురములో చిత్రాన్ని అందించిన సంగతి తెల్సిందే. హ్యాట్రిక్ కాంబినేషన్ గా ప్రచారం కాబడిన ఈ చిత్రం అన్న మాటను నిలబెట్టుకుంది. అల వైకుంఠపురములో విడుదలైన రోజే సూపర్ టాక్ తెచ్చుకుని దుమ్ము రేపిన సంగతి తెల్సిందే. రెండో రోజు కూడా అల వైకుంఠపురములో ఎక్కడా తగ్గలేదు. సాధారణంగా సోమవారం అనగానే ఏ చిత్రానికైనా డల్ డే, కానీ అల వైకుంఠపురములో విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో అల వైకుంఠపురములో ప్రభంజనం మాములుగా లేదు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో ఈ చిత్రం మొదటి రోజే ప్రాఫిట్స్ లోకి వెళ్లడం విశేషం. అంటే రెండో రోజు నుండి ఈ చిత్రానికి వచ్చే కలెక్షన్స్ అన్నీ లాభాలే. ఇక యూఎస్ లో కూడా అల వైకుంఠపురములో లాభాల దిశగా అడుగులు మొదలుపెట్టింది. రెండు రోజులకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. యూఎస్ లో దాదాపు 8.6 కోట్లకు అమ్మగా ఈ చిత్రం రెండు రోజుల్లోనే వాటిని వసూలు చేయడం విశేషం. యూఎస్ లో ఇప్పటికే 1.5 మిలియన్ మార్క్ ను చేరుకున్న అల వైకుంఠపురములో బన్నీ కెరీర్ లో హయ్యస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా నిలిచింది.

- Advertisement -

యుఎస్ఏ – $ 1,401,402 – 9.94 కోట్లు
కెనడా – $ 25,579 – 18.2 లక్షలు
ఆస్ట్రేలియా – $ 315,060 – 1.55 కోట్లు
యుకె – £ 78, 912 – 72.73 లక్షలు
యుఏఈ – AED 9,355 – 65.6 లక్షలు

2 డేస్ ఆల్ కంట్రీస్ టోటల్ – 13.02 కోట్లు (గ్రాస్)

ఇంకా మరికొన్ని దేశాల నుండి కలెక్షన్స్ రిపోర్ట్ అందాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All