
సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ చావవలసిందే ..! అంటూ 2.0 సినిమాలో చెలరేగిన పక్షి రాజా ఇప్పుడు ప్రకృతి ఒడిలో పలు సాహసాలు చెయ్యబోతున్నారు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, డిస్కవరీ చానెల్ కు చెందిన ప్రముఖ యాంకర్ బేర్ గ్రిల్స్ తో కలిసి అడవుల్లో “మ్యాన్ Vs వైల్డ్” ప్రోగ్రాం కోసం కలుస్తున్నారు. ఇక సహజంగానే స్టంట్స్ మరియు యాక్షన్ సీన్స్ అన్నీ డూప్ లేకుండా చేసే అక్షయ్. బేర్ గ్రిల్స్ తో కలిసి చెయ్యబోయే షో పై అందరి పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, బేర్ గ్రిల్స్ తోకలిసి ఒక కార్యక్రమం చేసారు. ఇక 2.0 సినిమా తరువాత అక్షయ్ కూడా సౌత్ లో ఫేమస్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయి వ్యక్తితో కలిసి బేర్ గ్రిల్స్ గతం లో “మ్యాన్ Vs వైల్డ్” ప్రోగ్రాం చేసారు. ఆ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో టీ.ఆర్.పీ సాధించడంతో రజనీ తో వచ్చే ఎపిసోడ్ మొత్తం ఇప్పటివరకూ ఉన్న రికార్డ్స్ అన్నీ బీట్ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎంతైనా ఇంతకాలానికి ఇండియా గొప్పదనం, ఇండియన్ స్టార్స్ గొప్ప తనాన్ని మిగిలిన దేశాలు వాళ్ళు తెలుసుకున్నారు.